ఈ ఆకులను జ్యూస్ చేసి తాగితే చాలు, ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధం.
ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో ప్రొబ్లెమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఇక వాము గింజలను వంటకాలతో పాటు పలురకాల పానీయాలు తయారీకోసం ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి.
అందుకనే కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొడి కాని వాము ఆకు కాని వాడితే ఉదరం శుభ్ర పడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామకులో విశిష్ట లక్షణాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి, అజీర్తి సమస్యలకి, ఆర్థరైటిస్ నొప్పికి, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలకి కూడా వాము ఆకులు బాగా పనిచేస్తాయి. దగ్గు జలుబు రెస్పిరేటరీ సమస్యలు కూడా దూరం అవుతాయి.
దగ్గు, జలుబు సమస్యల కి.. దగ్గు జలుబు సమస్యలకి వాము ఆకులు బాగా పనిచేస్తాయి వాము ఆకుల రసం మీరు తీసుకోవచ్చు. కొన్ని ఆకులు తీసుకుని వాటిని కడిగేసి ఒక పాన్ లో నీళ్లు పోసి ఆకుల్ని వేసి మరిగించిన తర్వాత ఆ రసాన్ని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలానే జలుబు పోతుంది. గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు. దగ్గు కూడా దూరం అయిపోతుంది.
జ్వరానికి…జ్వరానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఒక మెడిసిన్ లాగ ఇది పనిచేస్తుంది. వాము ఆకుల రసాన్ని తీసుకుంటే జ్వరం పూర్తిగా తొలగిపోతుంది. తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది..వాము ఆకుల రసాన్ని తీసుకుంటే తల్లిపాలు పడతాయి ఇందులో ప్రోటీన్ విటమిన్ సి ఉంటాయి. పాలిచ్చే తల్లులు బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంచుకోవడానికి వామాకుల రసాన్ని తీసుకోవచ్చు.
ఆర్థరైటిస్ నొప్పి..ఈ సమస్యతో బాధపడే వాళ్ళు వామాకుల రసాన్ని తీసుకుంటే చాలా బాగా పని చేస్తుంది. ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో వామాకుల రసాన్ని అప్లై చేయచ్చు కూడా. రోగ నిరోధక శక్తిని కూడా వాము ఆకుల ద్వారా పెంచుకోవచ్చు ఈ రసాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు.