Health

మీ మూత్రం లో వాసన వస్తే ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు ఇవే.

మన మూత్రం వాసన భరించలేనంతగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా లేదని అర్థం. మూత్రం వాసన రావటానికి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణం. ఇన్ఫెక్షన్ కి గురైనప్పుడు రంగు మారటం, వాసన రావడం తో పాటు గా మూత్రంలో మంట కూడా వస్తుంది. కొన్ని సార్లు దురద కూడా ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు అది యురెత్రా, బ్లాడర్, కిడ్నీ పై ప్రభావం చూపుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు సరిగా తాగక పోయిన ఇన్ఫెక్షన్ వస్తుంది. అందువలన రోజు 8 గ్లాసుల నీటిని తాగండి. అయితే మూత్ర విసర్జన చాలా చాలా అవసరం.

పగటి పూట ఏడెనిమిది సార్లు మూత్ర విసర్జన చేస్తే మీరు హెల్తీగా ఉన్నట్టు. అయితే మూత్రం కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామో, లేమో చెబుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మూత్రం రంగు, వాసన, పరిమాణాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్రం వాసన కూడా ఎన్నో రోగాలను సూచిస్తుంది. అమ్మోనియా వాసన.. సాధారణంగా మన మూత్రం ఎక్కువ వాసన రాదు. ఎందుకంటే మూత్రంలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది. అయితే మూత్రం ఘాటు వాసన అంటే అమ్మోనియా వాసన రావడం మీ ఆరోగ్యం అంత బాలేనట్టు. అంటే ఇది చాలావరకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చు.

వీటిలో ఎక్కువ భాగం ‘సిస్టిటిస్’ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. వాస్తవానికి మలం నుంచి బ్యాక్టీరియా మూత్రాశయంలోకి ప్రవేశించినప్పుడు ‘సిస్టిటిస్’ వస్తుంది. మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత వెనుక నుంచి ముందు వరకు టాయిలెట్ పేపర్ తో తుడుచుకోవడం ద్వారా లేదా సెక్స్ ద్వారా లేదా యూరినరీ కాథెటర్ ఉపయోగించడం ద్వారా బ్యాక్టీరియా మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు మూత్ర పిండాల్లోని రాళ్లున్నవారు, గర్భిణీ స్త్రీలు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఉన్న పురుషులు, రుతుక్రమం ఆగిపోయిన మహిళలు, డయాబెటిస్ ఉన్నవారు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

మంట, ఎప్పుడో ఒకసారి మూత్రవిసర్జన చేయడం, ముదురు రంగు మూత్రం, ఘాటైన మూత్రం, పొత్తికడుపులో నొప్పి ‘సిస్టిటిస్’ లక్షణాలు. చేపల వాసన.. కొన్ని సందర్భాల్లో మూత్రం చేపల వాసన వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. సాధారణంగా మహిళల్లో తెల్లటి ఉత్సర్గ ఉంటుంది. అయినప్పటికీ బాక్టీరియల్ యోని సమస్యలు ఉన్న మహిళల్లో ఉత్సర్గ చేపల వాసనను కలిగి ఉంటుంది. ఇది మూత్రం వాసనను కూడా ప్రభావితం చేస్తుంది. దీనికి హాస్పటల్ కు వెళ్లడమే మంచిది.

స్వీట్ల వాసన.. కొంతమందికి మూత్రం స్వీట్లు లేదా మిఠాయిల వాసన వస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడే మూత్రం ఇలాంటి స్వీట్ల వాసన వస్తుంది. డయాబెటిస్ పెరుగుతున్నప్పుడల్లా ఇలా అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇతర కారణాలు..మనం తినే ఆహారం కూడా మూత్రం వాసన వచ్చేలా చేస్తుంది. ఇది చాలా సహజం కూడా. వెల్లుల్లి, కాఫీ, వివిధ మసాలా దినుసులన్నీ ఇందుకు దారితీస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు లేదా శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు కూడా మూత్రం వాసన వస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker