Health

మూత్రం నుంచి వాసన వస్తోందా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

మీరు రాత్రి సరిగ్గా నిద్రపోనప్పుడు కాఫీ, టీ లేదా సోడా వంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు మూత్రం నుంచి ఘాటైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అలాంటి కొన్ని కారణాలతో మూత్రం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇలాంటి సమయంలో వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.

లేకపోతే ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్.. మీరు యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతుంటే అమోనియా వాసన యూరిన్ నుండి వస్తుంది. అయితే కేవలం వాసన ని బట్టీ చెప్పలేము. రక్తం పడటం, మంటగా ఉంటడం వంటి లక్షణాలూ ఉంటే అప్పుడు ఈ సమస్య ఉందని చెప్పొచ్చు.

షుగర్.. కుళ్లిన పండ్ల వాసన లాగ యూరిన్ నుండి స్మెల్ వస్తుంటే మూత్రంలో గ్లూకోజ్‌‌‌‌ ఎక్కువగా వుండడమని. కనుక ఇలా వాసన వస్తే ఓ సారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. బ్లాడర్ సమస్య.. బాక్టీరియల్ వాగినోసిస్ వంటి మూత్రాశయ ఇన్ఫెక్షన్‌స్ ఉంటే అప్పుడు యూరిన్ నుండి దుర్వాసన వస్తుంది. మాపుల్ సిరప్ మూత్ర వ్యాధి.. ఇది చాలా రేర్ గా వస్తుంది.

ఈ సమస్య తో వుండే పిల్లల యూరిన్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. మాపుల్‌ సిరప్‌ యూరిన్‌ సమస్య ఉంటే నిద్రలేమి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనపడతాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్య.. గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లాడర్ ఫిస్టులా మూలంగా కూడా యూరిన్ నుండి చెడ్డ వాసన వస్తుంది. కనుక జాగ్రత్తగా గమనించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker