మూత్రంలో నురుగు వస్తుందా..!మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే..?
సాధారణంగా మన మూత్రాశయంలో 400 నుంచి 600 మిల్లీలీటర్ల వరకు మూత్రం ఉండగలదు. ఈ పరిమితి దాటితే మూత్రాశయం ఒత్తిడి పెరగడం మొదలవుతుంది. అంతేకాదు ఆ మూత్రాన్ని విసర్జించకుండా అలాగే ఆపుకుంటూ పోతే మూత్రాశయ పరిమాణం ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఇలా పెరగడం వల్ల దీని నుంచి మెదడుకి సంకేతాలు తక్కువ మొత్తంలోనే అందుతాయి. అయితే సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉండి అందులో చాలా తక్కువ నురగ ఉండాలి.
అయితే కొన్ని రకాల మందులను తీసుకుంటే మూత్రం రంగు ముదురు రంగులోకి మారే అవకాశం ఉంది. అలాగే దానిలో బుడగలు కూడా ఉంటాయి. అయితే మందులను వాడటం మానేసిన వెంటనే ఈ సమస్య పోతుంది. మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు.. మీ మూత్రం బీర్ మాదిరిగా నురగలా ఉంటే మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనట్టే. మూత్రపిండాలు మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. వ్యర్థాలను మూత్రంగా మారుస్తాయి. అయితే ఈ విధానం సరిగ్గా పనిచేయకపోతే మీ మూత్రం నురుగుగా వస్తుంది.
అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ క్లినికల్ జర్నల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మీ మూత్రంలో ఎక్కువ నురుగు కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావొచ్చు. మీకు డయాబెటిస్ ఉండొచ్చు..చోనమ్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇన్సులిన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల వల్ల డయాబెటీస్ పేషెంట్లకు ప్రోటీన్యూరియా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు డయాబెటిస్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనం కనుగొంది.
దీని వల్ల మూత్రంలో నురగ ఏర్పడుతుంది. థైరాయిడ్..మూత్రపిండాలు, థైరాయిడ్ ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. మీ థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటే ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మీకే ఏరకమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నా అది మీ థైరాయిడ్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో ప్రోటీన్ సంశ్లేషణ, కణాల పెరుగుదలకు అవసరం.
అయితే దీనిలో లోపం ఉంటే అది నేరుగా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీస్తుంది. నిర్జలీకరణం..మీరు నీళ్లను తక్కువగా తాగినప్పుడు.. మీ శరీరంలోని నీటిని రక్షించడానికి మీ మెదడుకు సంకేతం అందుతుంది. ఈ సంకేతంతో మూత్రపిండాలు రక్తం నుంచి తక్కువ మొత్తంలో నీటిని తొలగిస్తాయి. ఇది మూత్రాన్ని నురుగుగా చేస్తుంది. అందుకే మీ మూత్రం ఇలా కనిపించినప్పుడల్లా మీరు నీటిని పుష్కలంగా తాగాలి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకుంటే మీ మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి.