మీ మూత్రం రంగు మారిందా ..? ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.
మూత్రం రంగు అనేక వ్యాధులకు సంకేతం కావచ్చు. కొందరు వ్యక్తులు తరచుగా మూత్రం రంగు మారడం వల్ల వ్యాధి బారిన పడతామేమో అని ఆందోళన చెందుతుంటారు. అయితే MayoClinic వెబ్‌సైట్ ప్రకారం.. మూత్రం రంగు మారిన ప్రతిసారీ అది వ్యాధికి సంకేతం కాకపోవచ్చు. అనేక రకాల ఆహారపదార్థాల నుండి లభించే వర్ణద్రవ్యం, రసాయనాలు కూడా మూత్రం రంగును మార్చడానికి కారణమవుతాయి.
అయితే యూరిన్ రంగుని బట్టి మనం ఆరోగ్యం ఎలా ఉంది అనేది చెప్పొచ్చు చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో మూత్రాశయ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే ఈ క్యాన్సర్ ని మనం యూరిన్ రంగును బట్టి గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మహిళల కంటే పురుషులకి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. మొదటి దశలో కనుక ఈ క్యాన్సర్ ని గుర్తించి చికిత్స పొందుతే బయటపడచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మూత్రాశయ క్యాన్సర్ లో రకాలు.. యూరోథెలియల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సిమోనా, అడెనోకార్సినోమా. మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు.. మూత్రంలో రక్తం, మూత్రవిసర్జన మార్పు, మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలగడం, బ్యాక్ పెయిన్, అలసట, పొత్తికడుపు భాగంలో నొప్పి, సడెన్ గా బరువు తగ్గడం. మూత్రాశయ క్యాన్సర్ రావడానికి గల కారణం.. స్మోకింగ్ చేయడం వలన ఈ సమస్య కలగొచ్చు.
కొన్ని రసాయనాల వలన రావచ్చు. రబ్బర్, లెదర్, డైస్, టెక్స్‌టైల్స్ వంటి వాటిలో వుండే ఈ రసాయనాల వలన సమస్య వచ్చే అవకాశం వుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే కూడా వచ్చే అవకాశం వుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచూ రావడం వలన కూడా ఇది వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.. మూత్రం రంగు మారితే డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి. మూత్రం నుండి రక్తం వచ్చినా సరే డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి.