ఉదయాన్నే మూత్రం పసుపు రంగులో వస్తుందా..? అస్సలు ఆలస్యం చేయకుండా..?
మూత్రం శరీరంలో ఒక ముఖ్యమైన పనితీరును కలిగి ఉంది, ఎందుకంటే ఇది శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అనేక వ్యాధుల నిర్ధారణలో మూత్రం ఒక ఉపయోగకరమైన సాధనం. ఎందుకంటే మీ మూత్రం రంగు మీ శరీరం లోపల ఏమి జరుగుతుందో తెలియజేస్తుంది.
శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరోబిలిన్ పిగ్మెంట్ కారణంగా సాధారణ మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. మీరు త్రాగే నీటిని బట్టి కూడా మూత్రం రంగు మారవచ్చు. అయితే ఉదయం వేళ మూత్రం పసుపు రంగులో రావడానికి గల కారణాలు.. ఒక వ్యక్తి తన శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది.
కిడ్నీలో రాయి ఉన్నప్పుడు ఉదయం వేళ మూత్రం పసుపు రంగులో వస్తుంది. అటువంటి పరిస్థితిలో మూత్రం రంగు మారడంతో పాటు జననాంగంలో నొప్పి, మంట కూడా సంభవించవచ్చు. గర్భిణీ స్త్రీలకు కూడా తెల్లవారుజామున మూత్రం పసుపు రంగులో వచ్చే సమస్య ఉంటుంది.
ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం ఉంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాలను ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తి మూత్రం రంగు మారుతుంది.
ఉదయం నిద్రలేచిన తర్వాత అలాంటి వారి మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంది. మూత్రం పసుపురంగులో కనిపిస్తే ఈ పద్దతులను అనుసరించండి.. నీరు పుష్కలంగా తాగాలి. ఆహారంలో విటమిన్ సి చేర్చుకోండి. ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోండి. జామకాయ తినండి. పెరుగు తినండి. గ్రీన్ టీ కూడా తీసుకోండి.