ఉప్పు, కారం కలిపిన మామిడి ముక్కలు తింటే చాలు. ఈ జబ్బులన్ని వెంటనే తగ్గిపోతాయి.
మామిడికాయలను ఉప్పు కారం కలిపి పచ్చిగా తినడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతారట. ఆ రెండు శరీరంలో కేలరీలను పెంచేస్తాయి. అధిక కేలరీల ఆహారాన్ని తింటే ఉబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా తినడం వల్ల శరీరానికి పోషకాలు ఏమీ అందవు. కారం,ఉప్పు చల్లుకోవాల్సిన అవసరం లేదు. అదొక చిరు తిండి కావచ్చు. అయితే మామిడికాయల్లో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు ఎలాంటి ఆందోళన లేకుండా పచ్చి మామిడి కాయలను ఎంచక్కా లాంగించేయొచ్చు.
ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగితే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మామిడి రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పచ్చిమామిడిలో మెగ్నీషియం, పొటాషియం,సంపూర్ణం గా లభిస్తాయి. కాబట్టి, పచ్చి మామిడికాయ తినడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పచ్చి మామిడికాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తే అనేక వ్యాధులను నయం చేస్తుంది. మామిడికాయలో జీర్ణక్రియకు అవసరమైన అమైలేస్ అనే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి.
అమైలేస్ ఎంజైమ్‌లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను మాల్టోస్, గ్లూకోజ్ వంటి చక్కెరలుగా మార్చడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మామిడికాయలు ఉత్తమ ఔషధం. మామిడిలో ఉండే ఎనెనిన్ కొవ్వు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని ద్వారా మామిడి కూడా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. పచ్చి మామిడి కాయ వేసవి వేడిమి ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతం పెంచేందుకు పచ్చి మామిడి తింటారు.
ఇమ్యునిటీ ని తిరిగి పొందాలంటే పచ్చి మామిడి దోహదం చేస్తుంది. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు, కారం దట్టించి తింటే.. ఇమ్యునిటీ ని పెంచేందుకు సహకరిస్తుంది. అంతేకాదు.. పచ్చి మామిడి కాయ తినటం వల్ల వేసవిలో వచ్చే సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. పచ్చి మామిడి కాయలో లభించే ఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి.
అది క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి కాయ శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి మామిడి కాయ తినడం వల్ల చర్మం సంరక్షిస్తుంది. పచ్చిమామిడి తినడం వల్ల మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు, కంటికింద చారలు, గుంటలు పడడం, రకరకాల సమస్యలను దూరం చేస్తుంది.