Health

ఈ గింజలు తింటే థైరాయిడ్ సమస్య నుంచి సింపుల్ గా బయటపడొచ్చు.

థైరాయిడ్‌ హార్మొన్స్‌ తగ్గితే.. శరీరం వెయిట్‌ పెరుగుతుంది. దీన్నే హైపోథైరాయిడిజం అంటారు. శరీరంలో ఒక్కసారిగా థైరాయిడ్‌ పెరిగితే.. బరువు తగ్గుతుంది. ఈ వ్యాధికి సంబంధించి బయటకు కనబడే లక్షణాల్లో మెడ ఉబ్బడం ఒక్కటి. అయితే థైరాయిడ్ బ్యాలెన్స్ గా లేకపోతే అది శరీరానికి సరిపడినంత హార్మోన్లను విడుదల చెయ్యలేదు. ఈ గ్రంథిలో ఏదైనా సమస్య వస్తే అలసట, జలుబు, జుట్టు రాలడం, అకస్మాత్తుగా బరువు పెరిగిపోవడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. వాటిని అధిగమించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి.

పోషకాలు ఉండే ఆహారంతో పాటు మందులు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లక్షణాలు తగ్గించుకోవచ్చు. వాటితో పాటు ఆహారంలో అయోడిన్, కాల్షియం, విటమిన్ డి విరివిగా తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం శరీరంలో థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. గర్భిణులకి తప్పని సరిగా థైరాయిడ్ పరీక్ష రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమస్య ఉంటే తల్లికి చనుబాలు రాకుండా అడ్డుకుంటుంది. అందువల్లే ఈ సమస్య రాకుండా తప్పనిసరిగా చూసుకోవాలి. గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాలని గ్రహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

శరీరంలోని థైరాయిడ్ విడుదల చేసే హార్మోన్లని సమతుల్యం చేసేలా ప్రోత్సాహిస్తుంది. ఎండిన గుమ్మడి గింజలను ప్రతి రోజు ఒక ఔన్స్ తినడం ద్వారా శరీరానికి సరిపడా జింక్ పొందవచ్చు. ఉసిరికాయలో నారింజ కంటే ఎనిమిది రెట్లు, దానిమ్మ కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి పొందేందుకు అవసరమైన అద్భుతమైన సూపర్ ఫుడ్ ఇది. జుట్టు రాలే సమస్యకి కూడా ఇది చెక్ పెడుతుంది. జుట్టు నెరవకుండా చేసేందుకు దోహదపడుతుంది. అంతే కాదు చుండ్రుని నివారించి, హెయిర్ ఫోలికల్స్ ని బలపరుస్తుంది. తలకి రక్తప్రసరణ మెరుగ్గా అయ్యేలా చేసి జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది. పెసలు..పెసల్లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

థైరాయిడ్ అసమతుల్యతని తగ్గించడంతో పాటు మలబద్ధక సమస్యని నివారిస్తుంది. అయోడిన్ ని అందిస్తాయి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. అందుకే ఫ్రెండ్లీ డైట్ గా వీటికి పేరు ఉంది. చాలా మంది బరువు తగ్గేందుకు వీటిని మొలకలుగా చేసుకుని తింటారు. ఇవే కాదు సీజనల్ వారీగా వచ్చే పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీస్, నారింగా వంటిని తీసుకోవచ్చు. అలాగే ఈ గ్రంథి పనితీరుకు ఆటంకం కలగకూడదు అంతే కాఫీ, మద్యపానానికి దూరంగా ఉండాలి. గ్లూటెన్ రిచ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. గోధుమలు, బార్లీ వంటి ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్ గ్రంథి వాపుని పెంచుతాయి. అందుకే గ్లూటెన్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎంచుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker