News

ఉత్తర కొరియాలో రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు, ఆ చిన్నారి చేసిన తప్పేంటో తెలుసా..?

ఉత్తర కొరియాలో క్రైస్తవులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చేతిలో బైబిల్‌తో కనిపిస్తే చాలు వారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులందరికీ శిక్ష విధిస్తున్నారట. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022 పేరుతో అమెరికా విదేశాంగ శాఖ ఓ రిపోర్టును విడుదల చేసింది.

ఇందులో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి క్రైస్తవులపై పాల్పడుతున్న దారుణాలను పేర్కొంది. ఇతర మతాల వారి పట్ల కిమ్‌ ప్రభుత్వ దాష్టికాలను వెల్లడించింది. ఇప్పటివరకు ఉత్తర కొరియాలో 70వేల మంది క్రైస్తవులను జైల్లో వేశారని నివేదిక పేర్కొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించింది.

అయితే నడక కూడా సరిగ్గా నేర్వని రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు విధించింది ఉత్తర కొరియాలోని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రభుత్వం. ఆ బాలుడి తల్లిదండ్రులు క్రైస్తవ పవిత్ర గ్రంథం ‘బైబిల్‌’ను కలిగి ఉండటమే ఈ శిక్షకు కారణం. వారితో పాటు బాలుడికి, ఇతర కుటుంబసభ్యులకు కూడా జీవితఖైదు విధించింది కిమ్‌ సర్కారు.

2009లో జరిగిన ఈ ఘటన తాజాగా అమెరికా విడుదల చేసిన ఒక నివేదిక ద్వారా బయటకు వచ్చింది. ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక – 2022’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలో దాదాపు 70 వేల మంది క్రైస్తవులు, ఇతర మతాలను పాటించే వారిని జైళ్లలో వేశారు.

ఇలా అరెస్టు చేసిన వారిలో రెండేండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరిని రాజకీయ జైలు క్యాంపుల్లో పెడుతున్నారు. ఈ క్యాంపుల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, వీరిని హింసిస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారని, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఈ నివేదిక పేర్కొన్నది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker