News

పడగ గదిలో మరో మహిళతో తల్లి రాసలీలలు, కొడుకు చూశాడని ఆ తల్లి ఏం చేసిందో తెలుసా..?

అందంగా సాగుతున్న జీవితం, రత్నాల్లాంటి పిల్లలు, అంతలోనే భార్యభర్తల మధ్య ఉన్నట్లుండి పెద్ద అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగింది. 8 ఏళ్ల శ్రేయాన్షు హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీని వెనక శ్రేయాన్షు తల్లి, ఆమె లెస్బియన్ భాగస్వామి హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు.

వారి అక్రమ సంబంధం గురించి చిన్నారికి తెలియంతో.. అతడిని ఇద్దరూ కలిసి చంపేశారు. వినాయకుడి విగ్రహంతో తలపై కొట్టి.. కత్తితో కోసి హత్య చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శాంత, పర్వీన్ అనే మహిళులు స్నేహితులు. శాంతకు 2012లో పెళ్లయింది. ఆమెకు ఒక అబ్బాయి ఉన్నాడు. అతడి పేరు శ్రేయాన్షు. వయసు ఎనిమిదేళ్లు. పర్వీన్‌కు 2018లో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. పర్వీన్ ప్రవర్తన నచ్చక.. విడాకులిచ్చేశాడు.

శాంత, పర్వీన్‌ క్లోజ్‌గా ఉండేవారు. ఎంత క్లోజ్ అంటే.. వారిద్దరు స్నేహితులు కాదు.. ప్రేమికులు..! స్వలింక సంపర్కులు. వివాహాలు జరిగిన తర్వాత కూడా తరచూ కలుసుకునేవారు. వారి స్వలింగ సంపర్కం సైతం అలాగే కొనసాగింది. భర్త వెళ్లిపోయిన తర్వాత.. పర్వీన్ ఒంటరిగా ఉండేది. అప్పుడప్పుడూ శాంత ఇంటికి వెళ్లేది. ఈ మధ్య కూడా ఓసారి శాంత ఇంటికెళ్లింది పర్వీన్. బెడ్‌రూమ్‌లో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో.. శాంత కుమారుడు శ్రేయన్షు వారిని చూశాడు.

తమను ఏకాంతంగా చూసిన విషయాన్ని..అతడు ఎవరికైనా చెబుతాడేమోనని భయపడిపోయారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే.. శ్రేయాన్షు ఉండకూడదని అనుకున్నారు. అందుకే అతడిని చంపాలని పథకం వేశారు. శ్రేయాన్షును పర్వీన్ హత్య చేయగా.. అందుకు అతడి తల్లి శాంత సహకరించింది. ముందు ఓ ఇటుకతో అతడి తలపై బలంగా కొట్టింది. ఆ తర్వాత వినాయకుడి విగ్రహంతో బాదడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అంతటితో వదల్లేదు.

కత్తితో బాబు మణికట్టును కోశారు. దీని తర్వాత కూడా సంతృప్తి చెందక.. చిన్నారి శరీరంపై కత్తితో లెక్కలేనన్ని సార్లు దాడి చేసింది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో డెడ్‌బాడీని వదిలేశారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. వీరి బాగోతం బయటపడింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker