News

రెండు వారాలకు షకీలా ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా..?

తమ ప్రవర్తనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుని అప్రతిష్టపాలవుతారు. అందుకే బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చినప్పటికీ ఎంతోమంది దాన్ని రిజెక్ట్‌ చేస్తూ ఉంటారు. అతికొద్ది మంది మాత్రమే ట్రై చేస్తే పోలా అని హౌస్‌లో అడుగుపెడతారు. అలా ఈ సీజన్‌లోనూ ఓ కంటెస్టెంట్‌ హౌస్‌లో అడుగుపెట్టింది. ఆవిడే షకీలా. కేవలం తనకు పిలుపు వచ్చింది కదా అని ఏడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చింది షకీలా. అయితే ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతగా రెండు వారాలు పూర్తి చేసుకుంది

మొదటి వారంలో నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ కాగా, ఈ వారం సీనియర్‌ నటి షకీలా బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేషన్‌కు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా వయసు రీత్యా షకీలా బిగ్‌బాస్‌ హౌజ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండలేకపోయంది. అలాగే గేమ్స్‌, టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొనలేకపోయింది. హౌజ్‌ కంటే స్మోకింగ్ రూంలోనే ఎక్కువగా కనిపించింది. అయితే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లందరితోనూ ఎంతో కలుపుగోలుగా వ్యవహరించిందామె.

ఎంతో హుందాగా వ్యవహరించింది. దీంతో అందరూ ఆమెను షకీలా అమ్మగా పిలిచారు. అయితే నామినేషన్స్‌ అంటే మాత్రం తెగ భయపడిపోయేది షకీలా.తన హుందాతనంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌కు బాగా చేరువైన ఆమె ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటింగ్‌లో బాగా వెనకబడిపోయింది. చివరకు రెండో వారం నామినేషన్స్‌లో ఉన్న షకీలా బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. కాగా ఇప్పటివరకు శృంగారతారగా షకీలాపై చాలామందికి చెడు అభిప్రాయాలు ఉండేవి.

అయితే బిగ్‌బాస్‌ పుణ్యమా అని వారందరూ తమ అభిప్రాయాలను కచ్చితంగా మార్చుకుంటారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో అంత సింప్లిసీటీగా ఉన్నారామె. అందుకే హౌజ్‌ నుంచి షకీలా బయటకు వెళ్లిపోతుంటే అమర్ దీప్ ఏడ్చేశాడు. టేస్టీ తేజ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. ఇక మరో హౌజ్‌మేట్‌ దామిని ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా’ అంటూ పాట ఆలపిస్తూ కన్నీటి పర్యంతమైంది.

కాగా రెండు వారాలకే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చినా రెమ్యునరేషన్‌ గట్టిగానే అందుకుందట షకీలా. సాధారణంగా పాపులారిటీ, క్రేజ్‌ను బట్టి కంటెస్టెంట్స్‌కు పారితోషకం ఫిక్స్‌ చేస్తారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అలా షకీలాకు వారానికి రూ.3. 5 లక్షలు ఫిక్స్‌ చేశారట. రెండో వారంలో హౌజ్‌ నుంచి బయటకు రావడంతో షకీలా కు సుమారు రూ. 7 నుంచి రూ. 8 లక్షల రెమ్యునరేషన్‌ అందించారని టాక్‌ వినిపిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker