Health

బీపీ, షుగర్ ఉన్నవారు ఈ కూరగాయని గుర్తుపెట్టుకొని మరీ తినాలి, ఎందుకంటే..?

టర్నిప్‌.. రుచిలో బంగాళాదుంప, కనిపించడంలో ముల్లంగి, బీట్ రూట్‌లా ఉంటుంది.. భారతదేశంలో దీన్ని ‘షల్గం’ అని కూడా పిలుస్తారు. తెలుపు, ఊదారంగుల్లో ఇది లభిస్తుంది. ఎన్నో పోషకాల మూలం ఈ కూరగాయ.. కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎర్రగా బీట్ రూట్ ని పోలి ఉన్న దుంప పేరు టర్నిఫ్.

దీనిని స్థానికంగా ఎర్ర ముల్లంగి, షల్గం అనే పేర్లుతో పిలుస్తారు. ఇది శీతాకాలంలో ఎక్కువగా పండుతోంది. టర్నిప్ పోషకాల నిల్వ. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, ఇ మరియు కె, ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

టర్నిప్‌లలో మొక్కల ఆధారిత రసాయనాలైన ‘గ్లూకోసినోలేట్స్’ ఉన్నాయి, ఇవి బ్రెస్ట్ నుండి ప్రోస్టేట్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే వారానికి ఒకసారి తప్పకుండా తినండి. టర్నిప్ ఒక డైటరీ నైట్రేట్ ఆహారం. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడం మరియు రక్తంలో ప్లేట్‌లెట్స్ ఒకదానితో ఒకటి అంటుకోకుండా నిరోధించడం వంటివి చేస్తుంది.

షల్గం యాంటీ ఆక్సిడెంట్ లుటీన్‌తో కూడిన కూరగాయ. ఇది కళ్ల సమస్యల రాకుండా చేస్తుంది. అంతేకాకుండా కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. టర్నిప్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే డైవర్టికులిటిస్ పేగు సమస్యలు రాకుండా తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. టర్నిప్‌లో లిపిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker