తుమ్ముని ఆపుదాం అనుకున్నాడు, చివరికి గొంతు పోయింది.
కరోనా సమయంలో తుమ్ములు పక్కవారికి కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే తుమ్ములు రాకుండా ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. తుమ్ములను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అయితే తుమ్మును ఆపడానికి ప్రయత్నించిన ఓ బ్రిటన్ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. 34 ఏళ్ల బ్రిటన్ వ్యక్తికి పబ్లిక్ ప్లేస్‌లో ఉన్న సమయంలో తుమ్ము వచ్చింది.
అయితే ముక్కుకు చేతులు అడ్డుపెట్టి తుమ్మును ఆపేందుకు అతడు ప్రయత్నించాడు. ఇది గొంతులో వాపుకు దారితీసింది. దీని ఫలితంగా అతని స్వరపేటికలో రంధ్రం ఏర్పడింది. అతను ఏది తినాలన్నా కూడా తీవ్ర నొప్పితో బాధపడేవాడు..మెల్లిగా తన వాయిస్‌ని కూడా కోల్పోయాడు.
వైద్యుల ప్రకారం, ఆ వ్యక్తికి గతంలో ఎటువంటి చికిత్సా ప్రక్రియ లేదా గాయం అయినట్లు లేదు అని వెల్లడించారు. మొదటిసారి అతనికి ఇలా జరిగింది. అతని పరిస్థితి క్రమంగా మెరుగయ్యే వరకు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్‌తో అతనికి ఆహారం అందించారు.
తుమ్మేటప్పుడు ముక్కు రంధ్రాలు లేదా నోటిని ఎప్పుడూ అడ్డుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తుమ్ములను ఆపడానికి నాసికా రంధ్రాలను అడ్డుకోవడం ప్రాణాపాయం అని వైద్య నిపుణులు అంటున్నారు. నాసికా రంధ్రాలు మరియు నోటిని అడ్డుకోవడం ద్వారా తుమ్మును ఆపడం ప్రమాదకరమైన పని మరియు దీనిని నివారించాలి,
ఎందుకంటే ఇది న్యుమోమెడియాస్టినమ్, టిమ్పానిక్ పొర యొక్క చిల్లులు మరియు సెరిబ్రల్ అనూరిజం యొక్క చీలిక వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చట.