తులసి ఆకులను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఎంత మంచిదో తెలుసా..?
తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను ఏ రూపంలో తిసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఔషధాల తులసిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లోని పెరట్లో తులసి మొక్కను కచ్చితంగా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ తీసుకుంటే.. జలుబు, గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలు తగ్గుముఖం పడతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తులసి ఆకుల వల్ల కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. తులసిలో ఆల్సోలిక్ యాసిడ్, యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, జ్వరం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అందువల్ల మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే తులసి మీకు ఉత్తమమైనది.
ఖాళీ కడుపుతో ఆకులు నములితే..చక్కెర వ్యాధిగ్రస్తులకు తులసి దివ్యౌషధం. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ స్థాయి నియంత్రణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు గుప్పెడు తులసి ఆకులను తీసుకొని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి.
తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగేసెయ్యండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగితే.. తులసిలో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
జీర్ణక్రియను బలోపేతం చేయడానికి కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.