రోజు తులసి ఆకుల టీ తాగడం అలవాటు చేసుకోండి, జీవితకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
ఆయుర్వేదం ప్రకారం తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. తులసిలో అడాప్టోజెనిక్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అయితే టీ భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మిల్క్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ అంటూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమకి నచ్చిన టేస్ట్, ఆరోగ్యపరంగా టీ తీసుకుంటూ ఉంటారు. వీటన్నింటి కంటే తులసి టీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులని భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు.
దీని శక్తివంతమైన ప్రయోజనాల వల్ల పురాతన కాలం నుంచి తులసి ఆకులు అన్ని విధాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ ఆకులతో చేసిన టీ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక సమస్యల్ని నివారించవచ్చు. ఒత్తిడి తగ్గిస్తుంది..తులసి ఒక అడాప్టోజెనిక్. ఇది సరేరామ్ ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనసుకి ప్రశాంతత ఇస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యం..తులసిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఉబ్బసం, బ్రోన్స్కైటీస్, అలర్జీలు వంటి పరిస్థితులు ఉన్న వారికి గొప్ప ఔషధం లాంటిది. దీర్ఘకాలిక వ్యాధులు నయం..తులసిలో ఫ్లేవనాయిదలు, పాలీఫేనాల్స్ తో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలని రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యం..తులసి టీ అజీర్ణం, ఉబ్బసం, గ్యాస్ వంటి పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియని పెంచుతుంది. పేగు కదలికలు నియంత్రిస్తుంది. శోధ నిరోధక గుణాలు..తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలిక మంటని తగ్గిస్తాయి.
వాపుని నయం చేస్తుంది. గుండె ఆరోగ్యం..తులసి రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి గుండెని పదిలంగా ఉంచుతుంది. హృదయ సంబంధ వ్యాధులని దూరం చేస్తుంది. బరువు నియంత్రణ..బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి తులసి టీ ఉత్తమ ఎంపిక. జీవక్రియని పెంచుతుంది. బరువు తగ్గించేందుకు పరోక్షంగా సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం..తులసిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులో..తులసి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మధుమేహం ఉన్న వ్యక్తులు దీన్ని తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. మానసిక స్థితి మెరుగు..తులసి అభిజ్ఞా పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ తులసి ఆకులు నమలడం వల్ల కూడా ఇవే ప్రయోజనాలు పొందుతారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని తాజా తులసి ఆకులు లేదా తులసి పొడిని ఒక కూజా నీటిలో వేసి రాత్రాంతా మూత పెట్టి ఉంచెయ్యాలి. తెల్లవారి రోజంతా కూడా ఆ నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది.