Health

సర్వరోగనివారిణి ఈ చూర్ణం, రోజు ఒక్క చెంచాడు తీసుకుంటే చాలు.

ఇంగ్లీష్ మందులను తట్టుకునే బ్యాక్టీరియాను తరిమికొట్టే శక్తి త్రిఫల చూర్ణానికి ఉందని పరిశోధనల్లో తేలింది. ఐతే, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. త్రిఫలను నీటిలో కలిపి… కషాయంలాగా తాగొచ్చు. లేదంటే రాత్రివేళ పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అందువల్ల ఎంత తాగాలో ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలి. సాధారణంగా రోజూ 2 నుంచీ 5 గ్రాములు తీసుకుంటారు. అయితే త్రిఫల అంటే ఏంటి.. అమలాకి, బిభితాకి, హరితకి అనే మూడు ఆయుర్వేద మూలికల పొడి ఈ త్రిఫల చూర్ణం. ఆయుర్వేదం ప్రకారం వాటా, పిత, కఫ దోషాలని ఇది సమతుల్యం చేస్తుంది. శక్తివంతంగా అనారోగ్యాలు లేకుండా చురుకైన జీవితాన్ని గడిపేందుకు త్రిఫల చూర్ణం సహాయపడుతుంది.

అమలాకి అంటే ఉసిరి. కాలేయ పనితీరుని నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బిభితాకి కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది. పెద్ద పేగుని శుభ్రపరుస్తుంది. శ్వాసకోశ వ్యవస్థని కాపాడుతుంది. హరితకిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఎలా తీసుకోవాలి. త్రిఫల పొడి, క్యాప్స్యుల్, ద్రవ రూపంలో లభిస్తుంది. ఏది ఎంచుకున్నా మంచిదే. మౌత్ వాష్, చర్మ సంరక్షణ లేదా జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించాలని అనుకుంటే దాన్ని పొడి రూపంలో తీసుకోవాలి. రుచి నచ్చకపోతే క్యాప్సూల్స్ గా తీసుకోవచ్చు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..వ్యర్థాలని తొలగిస్తుంది.. పేగుల్లోని విష వ్యర్థాలని తొలగించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రోజంతా శక్తి పుష్కలంగా ఉంటుంది. పెద్ద పేగు శుభ్రపడటం వల్ల అధిక బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల శరీరంలోని హానికరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటుని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊబకాయం, మధుమేహం వల్ల కలిగే గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది. కంటికి మేలు.. కంటి శుక్లం, దృష్టి లోపం, గ్లకోమా వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, టానిన్లు, ఫినాల్స్, పాలీఫెనాల్స్, ఫైటో కెమికల్స్ తో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉన్నాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల జలుబు, దగ్గు, సాధారణ ఇన్ఫెక్షన్లు, అలర్జీలని నయం చేసేందుకు సహాయపడుతుంది. తెల్ల రక్తకణాల స్థాయిని పెంచుతుంది. ఐబీఎస్ కి చికిత్స.. ఇరిటేటబుల్ బవెల్ సిండ్రోమ్(ఐబీఎస్) చికిత్సకి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అతిసారం ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ చూర్ణం తీసుకోకపోవడమే ఉత్తమం. దంత సమస్యకి నివారిణి.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. చిగురు వాపుని తగ్గిస్తుంది.

దీని మౌత్ వాష్ గా తీసుకుంటే నోటి ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది. జుట్టు పెంచుతుంది.. జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు, జుట్టుకి బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపుతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ రెమిడీని ప్రయత్నిస్తే మీరు మంచి ఫలితాలు చూస్తారు. మొటిమలు తగ్గిస్తుంది.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మం మీద ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker