ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ కుప్పకూలిన యువకుడు, తరవాత ఏం జరిగిందో మీరే చుడండి.
గుండెపోటుతో కుప్పకూలే ముందు బ్లూ టీషర్ట్ ధరించిన యువకుడు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ కొద్దిసేపు విరామం తీసుకోవడం వీడియోలో కనిపించింది. ట్రెడ్‌మిల్‌పై పడిపోయిన యువకుడిని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. అయితే గత కొంతకాలంగా వ్యాయామం చేస్తూనో, ఆడుతూనో హఠాత్తుగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి దుర్ఘటనలు రోజు రోజుకీ అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లోని ఓ జిమ్‌లో ఓ యువకుడు ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత జిమ్ లో ఉన్న వ్యక్తులు యువకుడి దగ్గరకు చేరుకున్నారు. జిమ్‌లో జరిగిన ఘటన అంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఆ యువకుడు మెల్లగా ట్రెడ్‌మిల్‌పై పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.
యువకుడు పడిపోయిన తరువాత జిమ్ సిబ్బంది అతని సమీపంలోకి పరిగెత్తారు. అయితే అప్పటికే ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటన శనివారం రాత్రి 11.55 గంటలకు జరిగింది. పరుగు పరుగున ఓ యువకుడు మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, యువకుడు ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా, అకస్మాత్తుగా అతను దొర్లుతూ కిందకు పడిపోవడం కనిపించింది.
ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖోడాలోని సరస్వతి విహార్‌లో ఉన్న జిమ్‌లో యువకుడు వ్యాయామం చేస్తున్నాడు. ఆ యువకుడి పేరు సిద్ధార్థ్ అని తెలుస్తోంది. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ సిద్ధార్థ్ కిందపడడంతో అక్కడున్న వారు అతను అలిసిపోయి ఉంటాడని లేదా. ఏమైనా తల తిరిగి ఉంటుందని అందరూ భావించారు.
త్వరగా అతని వద్దకు వెళ్లి.. అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించగా .. అప్పటికే సిద్ధార్థ్ మృతి చెందాడు. మృతుడు బీహార్ వాసి అని చెబుతున్నారు. అతని మృతదేహాన్ని బీహార్‌లోని సొంత ఇంటికి తరలించారు.
#Shocking
— Ravi Pratap Dubey (@ravipratapdubey) September 16, 2023
A 19 years old young man died while #running on a #treadmill in a #Gym in #Ghaziabad. #CCTV footage of this entire incident shows that this 19 year old boy fell on the treadmill and died.
It is believed that he died because of #heartattack #gymboy #run pic.twitter.com/9kuSZ0MlZC