బిగ్ షాక్, USAలో పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలకు బిగ్ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ దేశాల అధినేతలందరి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికాలో చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్థిరపడిపోయారు. ఐటీ ఉద్యోగంతో అమెరికాలో స్థిరపడి నాలుగు డాలర్లు వెనకేసుకుందాం అనే ఆశతో లక్షల మంది ఇండియా నుంచి వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం అగ్రరాజ్యంలో జీవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత కథ మెుత్తం మారిపోతోంది. అందరూ ట్రంప్ ఈ సారి విదేశీయులను యూఎస్ నుంచి డిపోర్ట్ చేస్తారని భావిస్తే.. కొత్త ప్రెసిడెంట్ దానికంటే పెద్ద బాంబే పేల్చనున్నట్లు తేలింది.
అయితే ఈ సారి ఆయన కన్ను గ్రీన్ కార్డ్ హోల్డర్లపై పడిందని తెలుస్తోంది. దీంతో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం దాదాపు 10 లక్షల మంది భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపేదిగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలోని రూల్స్ ప్రకారం చట్టబద్ధమైన వలసదారులకు పుట్టిన పిల్లలకు ఆటోమెటిక్ గా యూఎస్ పౌరసత్వం వస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధానానికి కొత్తగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలకటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. కొత్తగా తీసుకొస్తున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం..
అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు ఆటోమేటిక్ US పౌరులుగా మారాలంటే కనీసం ఒక పేరెంట్ అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చని అందరూ భావిస్తున్నారు. ఇది యూఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉంది. ట్రంప్ తప్పుడు వ్యాఖ్యానాన్ని ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు తీర్పు అందుబాటులో ఉంది. అయితే గ్రీన్ కార్డ్ రూల్స్‌లో తీసుకొస్తున్న పైన మార్పు లక్షల మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్నందున, ఈ ప్రణాళిక భారతీయ ప్రవాసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాలు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. న్యాయ నిపుణులు ఈ ప్రతిపాదన కోర్టులో నిలబడదని అంటున్నారు. H-1B వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమ్మిగ్రేషన్ అటార్నీ అశ్విన్ శర్మ పేర్కొన్నారు.