News

ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు, ఈ సారి ఏమైందంటే..?

2023, జూన్ 5వ తేదీ సోమవారం ఉదయం.. డుంగూరి నుంచి బార్ ఘర్ వెళుతున్న గూడ్స్ రైలు.. బార్ ఘర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పక్కకు పడిపోయాయని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ యాక్సిడెంట్ లో రైలు డ్రైవర్లు, గార్డు సురక్షితంగా ఉన్నారు. పట్టాలు తప్పిన ప్రాంతానికి రైల్వే అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు మరమ్మత్తులు చేస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. అయితే ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది. బారాగఢ్‌ జిల్లాలో.. ఓ గూడ్స్ ట్రైన్‌కి చెందిన 5 బోగీలు.. మెంధపల్లి సమీపంలో పట్టాలు తప్పాయి. ఐతే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టమూ కలగలేదు. కాకపోతే… బోగీల లోని సున్నపురాయి.. పట్టాలపై పడటంతో… ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

ఇప్పటికే 3 రైళ్ల ప్రమాదం, విషాదాన్ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఘటనా స్థలిలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. తిరిగి ఆ పట్టాలపై ఇప్పుడు రైళ్లు పరుగులు పెడుతున్న సమయంలో… మళ్లీ ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కరమే. ఒడిశాలో ఇదివరకు కూడా చాలా రైలు ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం తరచూ కనిపిస్తోంది.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాతైనా రైల్వే అధికారులు అప్రమత్తం అవ్వాలి. అయినప్పటికీ ఈ గూడ్స్ రైలు ఎందుకు పట్టాలు తప్పిందో తేలాల్సి ఉంది. అయితే నాగర్ కోయిల్ – ముంబై రైలు వచ్చే సమయంలో.. గేట్ దగ్గర ఉన్న గేట్‌మేన్.. గేటు వేయాల్సి ఉంది. కానీ అతను గేటు వెయ్యలేదు. అదే సమయంలో.. వాహనాలు.. రైల్వే ట్రాక్‌ను అటూ ఇటూ దాటుతూ ఉన్నాయి.

ఇంతలో ట్రైన్ వచ్చేసింది. రైలు లోకోపైలట్.. దూరం నుంచి.. వాహనాల రాకపోకల్ని చూసి.. సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో.. రైలు గేట్ దాకా రాకముందే ఆగిపోయింది. దాంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. లోకోపైలట్ రైలును ఆపకపోయి ఉంటే.. మరో దుర్ఘటనగా దీన్ని చెప్పుకోవాల్సి ఉండేదని అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker