అలెర్ట్, మీ నోట్లో నాలుకను చూసి ఒంట్లో క్యాన్సర్ ఉందో లేదో ఇట్టే చెప్పొచ్చు.
క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. క్యాన్సర్ మొదటి దశలో కనిపించే లక్షణాలను సీరియస్‌గా తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాల్లో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా జనాల ప్రాణాలను హరిస్తుంది. ఈ వ్యాధి పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ కబలిస్తుంది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి మెడికల్ ఫీల్డ్ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతకమైన వ్యాధిగానే పరిగణిస్తున్నారు. క్యాన్సర్ ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించకపోతే, రోగి చనిపోవచ్చు. అయితే, సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. శరీరంలో క్యాన్సర్ ఎప్పుడు పుడుతుండో ప్రారంభదశలో చాలా మందికి అర్థం కాదు.
కానీ, ఈ ప్రాణాంతక వ్యాధి కణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని ముఖ్య లక్షణాలు కనిపిస్తాయి. క్యాన్సర్ లక్షణాలు ముందుగా గ్రహించి చికిత్స ప్రారంభించడం ద్వారా వాటిని సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ శరీరంలో వేళ్లూనుకున్నప్పుడు నాలుక రంగు మారడం ప్రారంభమవుతుంది. దీన్ని గమనించినట్లయితే అస్సలు విస్మరించవద్దు. వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నాలుక నుంచి పదేపదే రక్తస్రావం అవుతుంది. ఇలా జరిగినా నిర్లక్ష్యం చేయకూడదు.
ఇది క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు. అలాగే నాలుకను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. ఇది క్యాన్సర్ సంకేతమే. రోజురోజుకూ క్యాన్సర్ మరణాలు పెరడగానికి అనారోగ్యకరమైన ఆహారం కూడా ఒక కారణమే. అధిక జంక్ ఫుడ్ నుంచి ధూమపానం వరకు, మద్యం సేవించడం నుంచి కాలుష్యం వరకు ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలే.