Health

టూత్ బ్రష్‌ని మార్చడం లేదా..! అయితే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..?

వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రాల ప్రకారం.. ప్రతి 3 నుంచి 4 నెలలకొకసారి ప్రతి వ్యక్తి తమ బ్రష్‌ను మార్చాలి. వీలైతే మంచి నాణ్యత గల బ్రష్ కొనండి. మీరు బ్రష్ చేస్తున్నప్పుడు బ్రష్ ముళ్ళగరికెలు విరిగిపోతే బ్రష్ దెబ్బతిందని మీరు అర్థం చేసుకోవచ్చు. తరచుగా బ్రష్ వంగి ఉంటుంది. అయితే ఇవి మీ బ్రష్ దెబ్బతిన్న సంకేతాలు మాత్రమే కాదు. చిన్న పిల్లలు బ్రష్ చేసేటప్పుడు కొరుకుతారు. దీనివల్ల బ్రష్‌ల ముళ్లు త్వరగా విరిగిపోతాయి. పిల్లల బ్రష్‌లు త్వరగా క్షీణించడానికి ఇదే కారణం. అయితే మీకు తెలుసా డెంటిస్టులు మీ టూత్​ బ్రష్​ను ప్రతి 12 నుంచి 16 వారాలకు మార్చేయాలని సూచిస్తారు.

ఎందుకంటే అది మీ దంత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఈ సూచనలు జారీ చేస్తున్నారు. లేదంటే పలు దంత సమస్యలు తప్పవు అంటున్నారు. నార్మల్ టూత్​ బ్రష్ అంటే తక్కువ కాస్ట్​లో వచ్చేస్తుంది. ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ చాలా కాస్ట్​తో ఉంటుంది. మరి దానిని కూడా మార్చాలా అంటే.. కచ్చితంగా మార్చాలనే అంటున్నారు. మార్చకుంటే దంత ఆరోగ్యం ప్రభావితమై.. ఇన్ఫెక్షన్​ను వ్యాప్తి చేస్తుంది. తద్వార చిగుళ్ల వ్యాధి, దంత క్షయం, నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా విజృంభిస్తాయి.

రోజుకు రెండుసార్లు రెండు నిమిషాలు దంతాలు బ్రష్ చేయాలనే రూల్ ఉంది. ఇది దంతాలను కావిటీస్​ నుంచి రక్షిస్తుంది. ప్రతి భోజనం, చిరుతిండి తర్వాత దంతాలను బ్రష్ చేస్తే మంచిది అంటారు. ఇలా రెగ్యూలర్​గా బ్రష్ చేయడం వల్ల బ్రష్​గరికెలు పాడైపోవడం ప్రారంభిస్తాయి. సుమారు 3 నెలల్లో అవి వంగిపోతాయి. నోటిలోని దంతాల మధ్య ఖాళీలను శుభ్రం చేయడానికి స్ట్రైయిట్, మృదువైన బ్రిస్టల్స్​ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే దంతాల మధ్య ఆహారం, బ్యాక్టీరియా సమర్థవంతంగా తొలగుతుంది. వంగిపోయిన బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. అందుకే సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ టూత్​ బ్రష్​ను ప్రతి 3 నెలలకు ఓసారి మార్చమని సలహా ఇస్తుంది.

మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే.. అందరి టూత్​ బ్రష్​లు సమయమైనా కాకున్నా మార్చేయడం మంచిది. ఎందుకంటే చాలామంది బ్రష్​లను ఒకే చోట ప్లేస్ చేస్తారు. దీనివల్ల బ్యాక్టిరీయా ఒక బ్రష్ నుంచి మరొకదానికి మారే అవకాశముంది. కుదిరితే ఇంట్లో ఎవరూ అనారోగ్యంగా ఉన్నా వారి బ్రష్​ను సపరేట్​గా ఉంచండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వారి బ్రష్​లు తరచుగా మార్చాలి. ఎందుకంటే వారు బ్రష్​ను కరికేస్తారు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. ఎవరైనా పొరపాటున మీ టూత్​ బ్రష్ ఉపయోగిస్తే దానిని వెంటనే దూరం పెట్టేయండి.

మీరు ఎవరి టూత్ బ్రష్​ కూడా వినియోగించకండి. ఇలా చేస్తే బ్యాక్టిరీయా పెరిగి ఇన్​ఫెక్షన్లకు గురి అవుతారు. ఫ్యామిలీతో కలిసి ఉన్నా సరే.. ఎవరి బ్రష్​ను వారు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. లేదు ఒకే కప్పు, కంటైనర్​లో స్టోర్ చేస్తే.. ఒకరి బ్రిస్టల్స్​ మరొకటి బ్రష్​ను తాకకుండా ప్లేస్​ చేయండి. బ్రష్ చేసిన తర్వాత దానిని నీటితో శుభ్రం చేసుకోండి. దానిని శుభ్రం చేయాలనే సాకుతో.. మౌత్ వాష్, వేడి నీళ్లు ఉపయోగించాల్సి అవసరం లేదు. ఇలా చేస్తే బ్యాక్టిరీయా ఇంకా ఎక్కువయ్యే ప్రమాదముంది. దానిని క్లోజ్ చేసి పెట్టకపోవడమే మంచిది. మంచిగా గాలి తగిలే ప్రాంతంలో బ్రెష్​ను ఉంచండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker