Health

ఈ ఆకుల గురించి ఎవ్వరికి తెలియని రహస్యం, ఒక్కసారి ఈ ఆకు రసాన్ని తాగితే..?

ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు. సిటీల‌లో ఉండేవాళ్ల‌కు తిప్పతీగ‌ గురించి తెలియ‌క‌పోయినా.. ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పెద్ద‌లు చెబుతారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు.

అయితే వర్షాకాలంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ఈ సమయంలో తేమ తీవ్ర పెరుగుతుంది. దీని వల్ల ఆహారాలు కలుషితంగా మారుతాయి. అయితే ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే వైరల్ ఫివర్, జలుబు, ఇతర వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తిప్ప ఆకు డికాక్షన్ తీసుకోవాలి. ఈ డికాక్షన్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. తిప్ప ఆకు డికాక్షన్ తయారీకి కావలసిన పదార్థాలు.. తిప్ప ఆకు, 1 స్పూన్ పసుపు పొడి, 2 అంగుళాల అల్లం, 7-8 తులసి ఆకులు, 1 అంగుళం దాల్చిన చెక్క, 1/4 స్పూన్ నల్ల మిరియాలు పొడి, 2 స్పూన్ తేనె, 2 కప్పుల నీరు. తయారీ విధానం..

తిప్ప ఆకు డికాక్షన్ చేయడానికి.. ముందుగా ఒక పాత్రలో నీరు పోసి వాటిని వేడి చేయాలి. ఇప్పుడు ఈ నీటిలో పసుపు పొడి, నల్ల మిరియాల పొడి వేసి మరిగించాలి. ఇప్పుడు తిప్ప ఆకు, దాల్చిన చెక్క, అల్లం తురుము, తులసి ఆకులను అందులో వేయాలి. సుమారు 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీటిని ఫిల్టర్ చేయండి. రుచికి అనుగుణంగా తేనె వేసి కలపాలి. ఈ డికాక్షన్‌ని వారానికి 2-3 రోజులు తప్పనిసరిగా తాగాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker