ఈ ఒక్క జ్యూస్ తాగితే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడొచ్చు.
థైరాయిడ్ గ్రంధి మెడ మధ్యభాగంలో గొంతు ముందుండే అవయవం. ఇది వినాళ గ్రంధులన్నింటిలో పెద్దది. ఇది రెండు తమ్మెలు కలిగి మధ్య ఇస్తమస్ అను భాగంతో కలిపి ఉంటుంది.శరీరంలోని ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతో పాటు ఆర్థరైటిస్ సమస్యలు వచ్చిపడతాయి అయితే ఊబకాయంతో బాధపడుతున్నవారిలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్.
థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ఇందులో రెండు రకాల థైరాయిడ్ లు ఉంటాయి. ఒకటి శరీర ఆకృతిని పెంచుతుంది. రెండోది శరీరమే లేకుండా.. అంటే బక్కగా అయ్యేలా చేస్తుంది. థైరాయిడ్ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపునే వేసుకునే ట్యాబ్లెట్.. 5 గంటల కల్లా వేసుకోవాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్యారెట్, బీట్ రూట్, కీర, టమాటా కలిపి చేసిన జ్యూస్ ను పరగడుపునే తాగితే.. థైరాయిడ్ సమస్య తగ్గడంతో పాటు ఊబకాయం కూడా తగ్గుతుంది. పైన పేర్కొన్న నాలుగు రకాల కూరగాయల్ని చక్కగా కడిగి వాటి తోలు తీసి, ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. జ్యూస్ కొంచెం ఎక్కువగా రావాలంటే ఒక అర టీ గ్లాసు నీటిని కలుపుకుంటే చాలు.
ఈ మిశ్రమాన్ని వడగట్టి.. అందులో అరచెక్క నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ ఈ వెజిటబుల్ జ్యూస్ తాగితే థైరాయిడ్ సమస్యకు కొద్దిరోజుల్లోనే చెక్ పెట్టేయచ్చు. కండరాలు కూడా బలంగా తయారవ్వడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదం నుండి కూడా రక్షిస్తుంది.
గర్భిణులు, బాలింతలు కూడా ఈ జ్యూస్ ను నిస్సందేహంగా తాగొచ్చు. దానితో పాటు తినే ఆహారపు అలవాట్లలో కొన్నిమార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇడ్లీలు, దోసెలను తగ్గించి.. వాటి స్థానంలో మొలకెత్తిన విత్తనాలను తినడం అలవాటు చేసుకోవాలి.