Health

ఈ కూరగాయ 1 కిలో రూ. 85,000, వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..?

బిహార్‌కు చెందిన ఒక రైతు. అతడు పండించే ప్రత్యేకమైన కూరగాయల ధర పదులు, వందల్లో కాదు.. ఏకంగా వేలల్లోనే ఉంటుంది. ఒక కిలో రూ.85000 వరకు ధర ఉండే ‘హాప్ షూట్స్’ అనే ఈ కూరగాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటిని బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల అమ్రేశ్ సింగ్ అనే రైతు పండిస్తున్నాడు. ట్రయల్ బేసిస్‌లో వీటి సాగును ప్రారంభించినట్లు ఆయన చెబుతున్నారు. అయితే ప్రకృతి మనిషికి ప్రసాదించిన కూరగాయలు, పండ్లు, పువ్వులు వంటివి ఎన్నో ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్ని సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకూ అందుబాటులో ఉంటె.. మరికొన్ని మాత్రం అత్యంత ధనవంతులు మాత్రమే కొనుగోలు చేయగలరు అనిపించేలా అత్యంత ఖరీదుగా ఉంటాయి.

హాప్ షూట్స్ గ్లోబల్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వీటి ఖరీదు కిలోగ్రాముకు రూ. 85,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. హాప్ షూట్స్ రెమ్మలు ఖరీదైనవే.. ఎందుకంటే వీటిని పెంచడం, పండించడం శ్రమతో కూడుకున్నది. ఇవి ఏక వరుసలో పెరగవు.. అందుకని వీటి రెమ్మలును కట్ చేస్తూ.. ఒద్దికగా శ్రమతో పెంచాల్సి ఉంటుంది. వీటిని పెంచడానికి, కోయడానికి స్థలం ఎక్కువ కావాల్సి ఉంటుంది. హాప్ మొక్క ఆకుపచ్చగా ఉంటాయి. వీటిని బీర్ తయారీకి ఉపయోగిస్తారు. హాప్ షూట్స్ పువ్వులు ఆల్కహాలిక్ పానీయాల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.

ఆకుపచ్చ టెండ్రిల్స్ ఇతర ఆహార పదార్ధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. హాప్ షూట్స్ ఎక్కడ పెరుగుతాయంటే.. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించే ఈ కూరగాయలను మొదట హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ ప్రాంతంలో పండించారు. ఎక్కువగా శీతల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్కల పెరుగుదలకు దాదాపు 5 నుండి 6 వారాల వరకు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు అవసరం. పెరిగే సమయంలో 25 డిగ్రీల C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకోగలదు. అందుకే ఈ కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

హాప్ షూట్స్ పోషక విలువ.. వీటిల్లో వివిధ ముఖ్యమైన నూనెలు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉన్న మూలికా ఔషధంగా పరిగణించబడుతుంది. విటమిన్ ఇ, విటమిన్ బి6 , విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను చురుకుగా.. వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. చర్మానికి మంచిది.. మొక్కలో లభించే సహజ నూనె, ఖనిజాలు చర్మంపై శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. చర్మం ఉపరితల రక్త నాళాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. తద్వారా ఎరుపు , చికాకును తగ్గించడంలో సహాయపడతాయి.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.. అధ్యయనాల ప్రకారం బీర్ జుట్టును కడగడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, హాప్‌లు ఉంటాయి. ఇవి జుట్టు రాలడం.. చుండ్రును కూడా తగ్గించడంలో సహాయపడతాయి. రిలాక్స్డ్ కండరాలు.. కండరాల నొప్పి, శారీరక బాధల నుంచి ఉపశమనం పొందేందుకు హాప్ షూట్స్ మేలు చేస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది: హాప్ షూట్స్ శరీరం జీవక్రియను వేగవంతం చేస్తాయని.. అందువల్ల జీర్ణ ఆరోగ్యాన్ని శాంతపరుస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker