ఇలాంటివారు అరటి పండ్లు తినకపోవడమే మంచిది. ఎందుకంటే..?
అరటిపండ్లలో ఉన్న లెక్టిన్ అనే ప్రోటీన్ లుకేమియా కణాలు పెరగకుండా నిరోధిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. లుకేమియా కణాలు క్యాన్సర్ కారకాలు. లెక్టిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అని పిలవబడే అణువులను తొలగించడానికి సహాయపడతాయి. ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ఏర్పడితే, కణాల నష్టం సంభవించవచ్చు. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. అయితే నిపుణుల సూచనల ప్రకారం అరటి పనులు ఏ కాలంలో అయినా ఎటువంటి సందేహం లేకుండా తినవచ్చు.
సాధారణంగా అరటిపండు చలువనిస్తుంది. అందువల్ల ఇప్పుడు వర్షాకాలం మొదలవడంతో అరటిపండు తినటానికి చాలమంది సందేహపడుతుంటారు. ప్రతిరోజూ అరటిపండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండ్లలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ బి6, సి విటమిన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి కూడా అందిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు అరటి పండ్లు తినడం వల్ల మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి. అందువల్ల ఎటువంటి అనుమానం లేకుండా వానాకాలంలో కూడా అరటి పండ్లు తినవచ్చు. కాకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది.
దగ్గు, అజీర్తి, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండ్లకి దూరంగా ఉండటం మంచిది. ఈ సమస్యలలో బాధ పడేవారు అరటిపండ్లు తినటం వల్ల కఫదోషాన్ని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలో శ్లేష్మం అధికంగా ఏర్పడేలా చేస్తుంది. అందువల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎప్పుడైనా ఉదయం పూట అరటిపండ్లు తినాలి.
ఇలా తినడం వల్ల ఈ పండులో ఉండే ప్రొటీన్, ఫైబర్ జీర్ణం కావడానికి తగినంత సమయం ఉంటుంది. ముఖ్యంగా వాన కాలంలో అరటిపండు తప్పనిసరిగా తినాలి. వాన కాలంలో తరచూ దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అరటిపండు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇటువంటి అనారోగ్యం సమస్యలు దరి చేరకుండా కాపాడుతుంది.