Health

మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచితే 100ఏళ్లు బతుకుతారు. ఆ మొక్కలు ఏవో తెలుసుకోండి.

తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి. ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరాన తులసికోట కట్టకూడదు. అయితే ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. సూర్య రశ్మి పెద్దగా తగలకపోయినా మనం ఇండోర్ మొక్కలను పెంచుకోవచ్చు.

ఆ ఇండోర్ మొక్కలతో.. ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. కానీ.. ఎలాంటి మొక్కలను ఎంచుకోవాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. ఏవేవో మొక్కలు తెచ్చుకొని.. బతకడం లేదు అని ఫీలౌతూ ఉంటారు. కానీ, ఈ కింది మొక్కలను ఎంచుకుంటే మనకు ఈ సమస్య ఉండదు. అలోవెరా..ఇంట్లో ఏ మూలలో పెంచినా పెరిగే మొక్క ఇది. పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. బయట, బాల్కనీలో అయినా పెరుగుతుంది. ఇక, అలోవెరాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చాలా గాయాలు నయం చేయడంతో పాటు.. అందం, ఆరోగ్యం, చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఒక్కసారి నాటితో చాలా సంవత్సరాలు పెరుగుతుంది. రబ్బర్ ప్లాంట్..ఈ రబ్బర్ ప్లాంట్ కూడా పూర్తిగా ఇండోర్ మొక్క. ఇది కూడా ఎక్కువ కాలం జీవిస్తుంది. ఒక్క సారి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా సూర్య రశ్మి, కొద్దిగా నీరు ఉంటే ఈ మొక్క ఏకంగా 100ఏళ్లు అయినా పెరుగుతుంది. పీస్ లిల్లీ..దాదాపు ఇండోర్ మొక్కలను పెంచుకునే అందరి ఇళ్లలల్లో ఈ లిల్లీ ప్లాంట్ కనిపిస్తుంది. సూర్య రశ్మి లేకపోయినా పూలు పూసే మొక్క ఇది.

ఆకులే.. తెల్లటి పూలుగా మారతాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క కూడా పార్షియల్ సన్ లైట్, రెండు, మూడు రోజులకి ఒకసారి నీరు పోస్తే చాలు. ఈ మొక్క వందేళ్ల పాటు పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్..ఇండోర్ లో మొక్కలను పెంచుకోవాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ప్లాంట్ గా చెప్పొచ్చు. ఇది ఇంట్లో ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చాలా మినిమల్ కేర్ తో ఈ మొక్క పెరుగుతుంది. కొద్దిగా లైట్, నీరు ఉంటే చాలు. ఈ మొక్క గాలిని ప్యూరిఫై చేయడానికి సహాయపడుతుంది.

ఎక్కువ కాలం బతుకుతుంది. కాస్ట్ ఐరన్ ప్లాంట్..ఈ మొక్క కూడా చాలా ఎక్కువ కాలం బతుకుతుంది. పెద్దగా ఎక్కువ సూర్య రశ్మి కూడా అవసరం లేదు. చాలా తక్కువ మెయింటెనెన్స్ తో ఎక్కువ కాలం జీవిస్తుంది. ఈ మొక్కను కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ జాబితాలో చేర్చవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker