Health

ఈ మొక్క ఇంట్లో ఉంటే డాక్టర్ మీదగ్గర ఉన్నట్లే..! ఈ మొక్క 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేస్తుంది.

ఆయుర్వేదం లో విశిష్ట స్థానం దక్కించుకున్న ఈ రణపాల మొక్క సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్యల‌ను రణపాల ఆకు ద్వారా నయం చేసుకోవచ్చట. ఈ మొక్క ఆకులు కాస్త మందంగా తింటే వ‌గ‌రు, పులుపుగా అనిపిస్తాయి.

అయితే తులసి, వేప, మందారం ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలని మనం చూస్తూ ఉంటాం. ప్రయోజనకరమైన మొక్కలు చాలానే ఉన్నాయి. అందులో రణపాల కూడా ఒకటి. రణపాల మొక్కని చాలామంది వాళ్ళ ఇళ్లల్లో పెంచుతారు. ఆఫీసుల్లో కూడా అందంగా ఉంటుందని ఈ మొక్కని పెంచుతారు. ఈ మొక్క ఆకులు మాత్రమే కాదు, వేర్లు, కాండం కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. సుమారు 150 కి పైగా వ్యాధులని తగ్గించే శక్తి ఈ మొక్కకి ఉంది.

ఈ మొక్కను మీరు ఎలా గుర్తుపట్టాలంటే, ఈ ఆకు కొంచెం దళసరిగా ఉంటుంది. ఈ ఆకులు పులుపుగా, వగరుగా ఉంటాయి. ఈ మొక్క ఆకులతో చాలా సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా కిడ్నీల సమస్య, కిడ్నీలో రాళ్లు వంటి బాధలు తగ్గిపోతాయి. ఈ ఆకులని ఉదయం రెండు, రాత్రి రెండు తీసుకుంటే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు బయటకు వచ్చేస్తాయి. క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. డయాలసిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది ఈ రణపాల మొక్క.

మూత్రపిండాల పనితీరు కూడా ఈ మొక్కతో మెరుగు పడుతుంది. పేగుల నుండి హానికరమైన వ్యర్ధాలు అన్నీ కూడా బయటకి వచ్చేస్తాయి. ఈ మొక్క జీర్ణాశయంలోని అల్సర్స్ ని తగ్గించగలదు. మలబద్ధకం, అజీర్తి వంటి బాధల నుండి దూరంగా ఉంచగలదు. మలేరియా, టైఫాయిడ్ వంటి వాటి నుండి కూడా దూరంగా ఉంచుతుంది. శారీరిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. షుగర్ తో బాధపడే వాళ్ళు, ఈ ఆకులతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. తలనొప్పి తో బాధపడే వాళ్ళు, రణపాల ఆకులను తీసుకుని మెత్తగా నూరి ఆ పేస్ట్ ని నుదుటి మీద రాసుకుంటే, తలనొప్పి త్వరగా తగ్గుతుంది. చెవిపోటుతో బాధపడే వాళ్ళు ఈ ఆకుల రసాన్ని చెవిలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా రణపాల మొక్కతో అనేక లాభాలను పొందొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker