Health

ఈ మొక్క ఆకులు బంగారం కంటే విలువైనవి, ఎలానో తెలుసా..?

జల బ్రహ్మీ మొక్క మీరు ఎక్కువగా ఉన్న చోట పెరుగుతుంది. మడుగు నేలలో కూడా ఈ మొక్క విసారంగా పెరుగుతుంది. ఈ చెట్టుకి ఆకులతో పాటు పువ్వులు కూడా పూస్తాయి. ఈ మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతున్నారు. ఈ మొక్క ఆకులలో ఆల్కలైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని నరాల వైద్యానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

నరాల టానిక్, అభిజ్ఞ పెంచే సాధనంగా నీటి బ్రహ్మీ ఉపయోగపడుతుంది. అయితే బ్రహ్మీ లేదా బకోప మొన్నీరి. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఆయుర్వేద మూలిక. ఆయుర్వేదంలో వాడే మ్యాజిక్ మూలికలలో ఇది ఒకటి. ఈ బ్రహ్మీ మౌలిక ఉష్ణ మండల వాతావరణంలోనే పెరుగుతుంది. నీటి అడుగున ఇది పెరుగుతుంది. అక్వేరియంలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ ఔషధమూలికకు యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి.

అంటే టైప్1, టైప్2 మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని వాడవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచే లక్షణాలు దీనిలో ఎక్కువ. బ్రహ్మీ ఆకులను నేరుగా తినడం వల్ల రక్తంలో అధిక చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం వల్ల కలిగే లక్షణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఈ బ్రహ్మీ ఆకులు సహాయపడతాయి. బ్రహ్మీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. హానికర టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. బ్రహ్మీ ఆకులను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. మూర్ఛ వంటివి తగ్గే అవకాశం ఉంది.

మెదడు పనితీరును పెంచడంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలో బ్రహ్మీ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఎలా తీసుకోవాలి.. బ్రహ్మీ ఆకులతో తయారుచేసిన క్యాప్సుల్స్, సిరప్, పొడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఆయుర్వేద వైద్యులను కలిసి మీ సమస్యను చెప్పి దానికి తగ్గ బ్రాహ్మితో తయారు చేసిన మందులను కొనుక్కోవచ్చు. ఎంత మోతాదులో రోజుకు వేసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవాలి. నీటితో కలిపి తీసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker