ఈ ఆయిల్ లో ఇదొక్కటి కలిపి తలకు రాస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు.
ఆవనూనె బహుముఖమైనది మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉపయోగించబడుతుంది. ఇది భారతదేశంలో “సార్సన్ కా తైల్” గా ప్రసిద్ధి చెందింది మరియు ప్రతి వంటగదిలో కనిపించే ఒక కీలక పదార్ధం. ఆవ నూనె బలమైన రుచిని కలిగి ఉంటుంది మరియు అనేక వంటకాల రుచిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం.. దీనికి పొల్యూషన్ ఒక కారణం అయితే ఆహార లోపం మరొక కారణం.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.. జుట్టు ఎక్కువగా రాలకుండా ఉండటానికి రాలిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి ఇవి కలిపి రాసుకుంటే.. జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నూనె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే.. 100 గ్రాముల ఆవనూనె, రెండు శీకాకాయలు, నాలుగు కుంకుడుకాయలు, ఒక చెంచా కలోంజి విత్తనాలు, ఒక చెంచా మెంతులు, 6 ఎండబెట్టిన ఉసిరిముక్కలు అవసరం.
ముందుగా కుంకుడు కాయలలోని గింజలను తీసి పక్కనపెట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గాజు సీసాలో ఆవ నూనె పోసి అందులో మెంతులు, కలోంజీ విత్తనాలు, కుంకుడుకాయ, శీకాకాయ, ఉసిరికాయ అన్నింటినీ వేసి మూత పెట్టి బాగా గిలకోట్టాలి.. ఈ గాజు సీసాను మూడు రోజులపాటు ఎండలో ఉంచాలి.. ఆ తర్వాత ఈ నూనెను జుట్టుకు రాసి మర్దనా చేసుకోవాలి .. ఇలా వారానికి రెండు రోజులపాటు ఈ నూనె రాసుకుంటే జుట్టు రాలకుండా చేస్తుంది.
ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది .. ఎండగా లేదు అనుకునే వారికి ఒక గిన్నె తీసుకొని అందులో అవ నూనె వేసి అందులో ముందుగా చెప్పిన అన్ని పదార్థాలను వాటిలో వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి.. ఆ నూనెను వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.. ఇప్పుడు ఆ నూనెను ఒక గాజు సీసాలోకి వడపోసుకోవాలి. ఇలా కూడా నూనెను తయారు చేసుకోవచ్చు.. సమయం లేనప్పుడు ఇలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు.