ఈ నూనె జుట్టుకు వాడితే ఎంత పిక్కున్న రాలదు, అంత స్ట్రాంగ్‌గా మారుతుంది.
జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. వారు మెరిసే జుట్టుతో పాటు పొడవాటి జుట్టును కోరుకుంటారు. వాస్తవానికి, సరైన సమాచారం లేకపోవడం వల్ల, కొన్ని జుట్టు పెరగడానికి చర్యలను అవలంబించడం వల్ల ప్రయోజనాల కంటే జుట్టు రాలడం జరుగుతుంది. అయితే వాతావరణ మార్పులు శరీరంపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చాలా మందిలో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తున్నాయి.
అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ జుట్టు ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెను వినియోగించాల్సి ఉంటుంది. అయితే జుట్టుకు నూనె రాయడం వల్ల చుండ్రు, చివర్లు చిట్లడం, పొడి జుట్టు వంటి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జుట్టు సమస్యలు పోవడానికి, జుట్టు మందంగా తయారు కావడానికి ఔషధ మూలికలు కలిగిన నూనెను వినియోగించాల్సి ఉంటుంది. దానిలో ఉండే గుణాలు జుట్టు దృఢంగా చేయడమేకాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది. కాబట్టి తప్పకుండా నూనె అప్లై చేయాల్సి ఉంటుంది. జుట్టు పొడవుగా చేయడానికి నూనెలో వీటిని కలపండి.. కరివేపాను ఉడికించిన నూనె.. కొబ్బరి నూనె, కరివేపాకులను ఉపయోగించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.
దీని కోసం కొబ్బరి నూనెను వేడి చేసి.. దానికి 7 కరివేపాకులను వేసి మరిగించి జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. మీరు ఈ నూనెను వారానికి మూడుసార్లు వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. దీని వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు జుట్టు చిట్లడం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా చుండ్రు, తెల్ల జుట్టు సమస్య నుంచి విముక్తి పొందుతారు.
ఆలివ్ ఆయిల్, సోంపు..జుట్టు పొడవుగా పెరగాలంటే ఆలివ్ ఆయిల్ లో సోంపు కలిపి తలకు మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు దృఢంగా మారడంతో పాటు జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.