ఈ ఇంటి చిట్కాలతో 10 రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ ఖచ్చితంగా పోతాయి.
స్ట్రెచ్ మార్క్స్..ఎక్కువగా కడుపు, భుజాలు, కాళ్లపై వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయితే ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలు పాటిస్తే చాలా తొందరగా తగ్గిపోతుంది. అయితే బాడీ పాజిటివిటీలో స్ట్రెచ్ మార్క్స్ ను ప్రధానంగా ప్రస్తావించేందుకు కారణం ఇదే. కానీ వీటిని వదింలించుకోవాలంటే మాత్రం కాస్మెటిక్ సర్జరీలు, ఖరీదైన-అత్యంత హానికరమైన రసాయనాలున్న కాస్మెటిక్స్ జోలికి వెళ్లకండి. మీకు తెలుసా ఇటీవలి కాలంలో స్ట్రెచ్ మార్క్స్ ను దాచకుండా బహిరంగంగా కనిపించేలా సెలబ్రిటీలు సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు కూడా.
కైలీ జెన్నర్, అష్లే గ్రాహం, జమీలా జమిల్, రిహన్నా వంటివారు.. వియ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్ట్రెచ్ మార్క్స్ అంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పదేపదే పోస్ట్ చేస్తూ బాడీ పాజిటివిటీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మగవారికీ స్ట్రెచ్ మార్క్స్.. పురుషుల్లోనూ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కానీ ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకోరు. టీనేజర్లలో స్ట్రెచ్ మార్క్స్ ఉంటే వారు చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. మొండిగా ఉన్న ఈ మరకలు పోగొట్టాలంటే మీకు కాసింత ఓపిక ఉండాల్సిందే.. తీరిక చేసుకోవాల్సిందే. అలోవెరా.. కలబంద చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం.
కాంతివంతమైన చర్మం కోసం సరికొత్త స్కిన్ టిష్యూలను డెవలప్ అయ్యేలా చేసే శక్తి ఉన్న కలబంద, అద్భుత ఔషధంగా, పొట్టపై చారలకు విరుగుడుగా పనిచేస్తుంది. స్ర్టెచ్ మార్క్స్ ఉన్నచోట కలబంద గుజ్జును లేదా చిన్న ముక్కను సున్నితంగా రుద్ది ఓ అరగంటపాటు అలా ఆరనిచ్చి, తరువాత కడగండి. ఇలా తరచూ చేస్తే శాశ్వతంగా స్ర్టెచ్ మార్క్స్ పోతాయి లేదా అవి చాలా పలుచబడి చర్మంలో కలిసిపోతాయి. కోకోవా బటర్.. స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టేలా పనిచేసే కోకోవా బటర్ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది. రాత్రి పూట కోకోవా బటర్ మసాజే చేసుకుంటే కొంతకాలం తరువాత అవి మాయమవ్వటం ఖాయం.
కీరా-నిమ్మ.. నిమ్మరసంలోని సహజసిద్ధమైన ఎసిడిటీతో చర్మం రంగు పల్చబడుతుంది. చర్మం తాజాగా ఉంచే కీరా దోసకాయ గుజ్జును నిమ్మరసంతో కలిపి ప్యాక్ వేసుకుంటే స్ర్టెచ్ మార్క్స్ తగ్గుముఖం పడతాయి. వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా 10 నిమిషాలపాటు కొన్ని రోజులు చేస్తే తేడా మీరే చూస్తారు. నిమ్మ సహజసిద్ధమైన బ్లీచ్ కనుక చర్మంపై ఉన్న చారల రంగును ఇది తగ్గిస్తుంది. యాప్రికాట్ మాస్క్-ఆయిల్..మంచి స్క్రబ్ గా పనిచేసే యాప్రికాట్స్ స్ర్టెచ్ మార్క్స్ పై సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 లేదా 3 యాప్రికాట్లను తీసుకోండి.. వాటిని కట్ చేసి.. అందులోని గింజను తీసి.. పండును మాత్రం పేస్ట్ చేసి చారలు ఉన్నచోట ప్యాక్ వేసుకోండి.
ప్యూర్ ఆప్రికాట్ ఆయిల్ లో ఉన్న సుగుణాలు చర్మంపై సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ నూనెను నిమ్మ రసంతో కలిపి వాడితే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆముదం నూనె.. జుట్టుకు ఆముదం నూనెతో వచ్చే నిగారింపు, అందే పోషణ.. అది చర్మంపై రాసినప్పుడు కూడా చర్మానికి అచ్చం ఇవే వస్తాయి. మంచి ఫలితం కోసం గానుగలో తీసిన స్వచ్ఛమైన ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాయండి. ఇలా కొన్ని రోజులపాటు ఓపికగా చేస్తే ఫలితం ఉంటుంది. ఇంట్లో చేసుకునే ప్యాక్.. 2 కోడి గుడ్లలోని పచ్చ సొనలను బాగా గిలక్కొట్టి.. ఒక నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ పేస్ట్, తగినంత పాలు వేసి నున్నని పేస్టులా తయారు చేసుకున్న మిశ్రమం స్ట్రెచ్ మార్క్స్ పై అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా రోజుమార్చి రోజు చేస్తే స్ట్రెచ్ మార్క్స్ శాశ్వతంగా మాయమవుతాయి.