మీరు రోజు ఇలా చేస్తే జీవితంలో గుండెపోటు వచ్చే ప్రమాదం తప్పినట్టే.
పేలవమైన జీవనశైలి ఎంపికలు, అనారోగ్యకరమైన ఆహారం, అతిగా వ్యాయామం చేయడం వంటి అనేక అంశాలు గుండెపోటు కేసుల పెరుగుదలకు దోహదపడ్డాయి. గుండెపోటు ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పనప్పటికీ మీ శరీరంలోని కొన్ని భాగాలు గుండెపోటు రాబోతుందని సూచిస్తాయి. అయితే చాలా మంది హెల్తీగా ఉండాలని ప్రతిరోజూ వ్యాయామం చేస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తింటుటారు. అయినప్పటికీ గుండెపోటు బారిన పడుతుంటారు. టైం కి పడుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, పొగాకుకు దూరంగా, మద్యపానానికి దూరంగా ఉంటేనే చాలు మీ గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది.
ఈ అలవాట్లే మిమ్మల్ని గుండెపోటు ప్రమాదం నుంచి తప్పిస్తాయి. సూర్యోదయానికి ముందే మేల్కోవాలి: సమయానికి పడుకోండి. అలాగే సూర్యుడు ఉదయించడానికే మునుపే లేవండి. కొద్ది సేపు వ్యాయామం చేయండి. రోజూ ఇలా చేయడం చాలా మంచి అలవాట. దీనివల్ల మీరు రీఫ్రెష్ గా ఉండటమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. రోజూ 7 నుంచి 8 గంటలు పడుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యంగా తినండి, మద్యానికి దూరంగా ఉండండి: మద్యం ఎన్నో రోగాలకు దారితీస్తుంది. దీన్ని తాగడం వల్ల లివర్ పాడవడమే కాదు.. గుండె కూడా రిస్క్ లో పడుతుంది. అందుకే మద్యంతాగే అలవాటును మానుకోండి.
పండ్లు, కూరగాయలను, సలాడ్లను ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాయామాలు చేయండి.. రోజంతా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల బ్యాక్ పెయిన్ నే కాదు శరీరంలో కొలెస్ట్రాల్, బరువు విపరీతంగా పెరిగిపోతాయి. వీటివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి. కాబట్టి రోజుకు ఒక 30 నిమిషాలపాటైనా వ్యాయామం చేయండడి. క్రమం తప్పకుండా ఏరోబిక్, బరువు శిక్షణ, యోగా వ్యాయామాలు చేస్తే హెల్తీగా ఉంటారు. త్వరగా పడుకోండి..
అర్థరాత్రి వరకు మేలుకువగా ఉండటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఇది అస్సలు మంచి అలవాటు కాదు. దీనివల్ల బరువు పెరగడమే కాదు జీవక్రియలు దెబ్బతింటాయి. పనిపట్ల ఏకాగ్రత తగ్గుడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి వీలైనంత తొందరగా పడుకోండి. ఇందుకోసం మీ రోజును ప్లాన్ చేసుకోండి.షెడ్యూల్ చేయండి. ప్రతిరోజూ డైరీ రాయండి. త్వరగా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం, ఉదయాన్నే మేల్కొవడం వంటి అలవాట్ల వల్ల మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.