Health

ఈ ఆకుని కూర చేసుకొని తింటే బయటకు చెప్పలేని రోగాలన్నీ మటుమాయం.

పొన్నగంటి కూర ఆకులు చిన్న నుండి మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి.ఆకు పొడుగుగా బల్లెంరూపు తో దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. సగటున దీని ఆకులు 3-15 సెంటీమీటర్ల పొడవు, 1-3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.ఆకులు పొడవైన, ఇరుకైన, ముదురు ఆకుపచ్చరంగుతో చదునైన అంచులతో మృదువుగా ఉంటాయి. అయితే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఆకుకూర మార్కెట్లో మనకి చౌకగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ అకకూరని ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా సులభం.

ఈ ఆకుకూర కాండం తీసుకోని నాటినా కూడా కూడా తొందరగా అభివృద్ధి చెందుతుంది. పొన్నగంటి ఆకులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, రైబోఫ్లెవిన్‌, విటమిన్ ఏ,బి 6, సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పొన్నగంటి ఆకు తీసుకోవడం వల్ల ఇవి శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఈ ఆకుకూరలో ఉండే పోషకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.

కట్టి చూపు సమస్యలతో బాధపడేవారు ఈ ఆకుని తాలింపుగా చేసి తినటం వల్ల కంటిచూపు మెరుగుపడటమే కాకుండా కంటి కింద ఉన్న నల్లటి వలయాలు కూడా దూరమవుతాయి. అంతే కాకుండా ఈ ఆకులను కొంత సమయం కళ్ళ మీద పెట్టుకోవటం వల్ల కంటి కలకలు, కురుపులతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో వంటి వ్యాధులతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకోవటం వల్ల ఆ సమస్యల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.

పొన్నగంటి ఆకులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది . ఈ ఆకుతో పప్పు, తాలింపు వంటివి చేసుకొని తినటం వల్ల ఎముకల దృఢంగా మారటమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ వ్యాధితో బాధ పడేవారు వారు కూడా ఈ ఆకుని ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేసుకుని తినటం వల్ల వీటిలో ఉండే కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker