ఈ ఆకులను ఇలా చేసి తీసుకుంటే మధుమేహంతో సహా శ్వాసకోశ సమస్యలన్ని మటుమాయం.
వెదురు ఆకుల నుంచి మంచి రుచి కలిగిన టీ తయారు చేస్తున్నారు త్రిపురకు చెందిన గిరిజన వ్యాపారి సమీర్ జమాతియా. ఈ పానీయానికి ఛాయ్ ప్రియులు సహా ఇతర రాష్ట్రాల్లోని వర్తకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించేందుకు వారు ఇంట్రస్ట్ చూపుతున్నారు. చాలా మందికి వెదురు ఆకులతో టీ తయారుచేసి తాగుతారని తెలియదు. కానీ ఆ టీతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇకపై ఆ టీనే తాగే చాన్స్ ఉంది.
అయితే వెదురు ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. వీటి వాడకంతో మధుమేహం నుంచి ఊబకాయం వరకు అన్నీ అదుపులో ఉంటాయి. ఈ ఆకులు శ్వాసకోశ సమస్యల నుండి కూడా సమర్థవంతంగా ఉపశమనం కలిగిస్తాయి. వెదురు ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రుజువు చేస్తుంది. డయాబెటిస్‌లో మేలు చేస్తుంది.. వెదురు ఆకులను తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగులకు చాలా మేలు జరుగుతుందని నిరూపించబడింది.
ఫైబర్ పుష్కలంగా ఉండే వెదురు ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి వినియోగం శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు మీ వైద్యుని సలహాతో వెదురు ఆకులతో చేసిన టీని తాగొచ్చు. నోటిపూత నుండి ఉపశమనం కలిగిస్తుంది.. వెదురు ఆకులను నోటిపూతలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించాలంటే వెదురు ఆకులను బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానికి తేనె కలుపుకుని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.
ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే నోటిపూత నుంచి బయటపడవచ్చు. పొడి దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది..మీరు పొడి దగ్గు సమస్యతో బాధపడుతుంటే, వెదురు ఆకులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాదు శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. దీని కోసం వెదురు ఆకులను ఎండబెట్టి గ్రైండ్ చేసుకుని పొడిని తయారు చేసుకోవాలి. అందులో తేనె మిక్స్ చేసి తినాలి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..వెదురు ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
మీరు గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం లేదా అతిసారం వంటి సమస్యలతో బాధపడుతుంటే, మీరు వెదురు ఆకులతో చేసిన టీ లేదా డికాక్షన్ తాగవచ్చు. ఇది పొట్టకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది..వెదురు ఆకులను ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. దీని కోసం, తాజా వెదురు ఆకులను రుబ్బు కోవాలి. ఈ పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.