ఈ ఆకులను రోజూ నమిలితే బీపీ, షుగర్ రెండు పూర్తిగా తగ్గిపోతాయి.
కరివేపాకు ప్రతి రోజూ క్రమం తప్పకుండ ఆహారంలో తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు తలగిపోతాయి.. దీని చెట్టు వేళ్ళతో కషాయం చేసి ప్రతి రోజూ నెల రోజుల పాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు కరిగి పోతాయి.. నూనెలో కరివేపాకు వేసి, బాగా మరిగించి రోజూ ఆ తైలాన్ని తలకు రాసుకుంటే క్రమ క్రమంగా జుట్టు నల్లబడుతుంది.
అయితే ఈ మధ్య కాలంలో మనుషుల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. పోషకాలు ఉన్న ఆహారం కంటే రుచిగా ఉండే ఆహారానికే ఎక్కువ ఫ్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఎక్కువమంది ఈ వ్యాధుల బారిన పడుతూ సంవత్సరాల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు.
మందులు వాడినా తాత్కాలిక ఫలితమే తప్ప పెద్దగా ప్రయోజనం లేకపోవడం కూడా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య అంతకంతకూ పెరగడానికి కారణమవుతోంది. ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలి ఈ వ్యాధుల బారిన పడటానికి కారణమవుతోంది. ఈ వ్యాధుల బారిన పడిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తరచూ మాత్రలు వాడటం ద్వారా మాత్రమే ఆయుష్షును పెంచుకోవడం సాధ్యమవుతుంది.
అయితే కొన్ని సహజ చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా ఈ వ్యాధులకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కొన్ని ఆకులను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా రక్తపోటు, షుగర్ వ్యాధులను అదుపు చేయవచ్చు. టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడేవారు తులసి ఆకులను రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని..
రక్తపోటు అదుపులో ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. దక్షిణాది వంటల్లో ఎక్కువగా వినియోగించే కరివేపాకు సైతం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజానాలను కలిగి ఉంటుంది. రోజూ ఉదయాన్నే కరివేపాకు ఆకులను తీసుకుంటే ఇన్సులిన్ లెవెల్స్ మెరుగుపడతాయి. వేప కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. రోజూ వేప ఆకులు తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అయితే వైద్యుల సూచనల మేరకు వీటిని తీసుకోవడం మంచిది.