Health

లడ్డూలను ఈజీగా ఇంట్లో చేసుకొని రోజుకు ఒకటి తింటే జీవితంలో గుండె జబ్బులు, షుగర్ వ్యాధి రాదు.

అవిసె గింజ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఈ గింజ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. అవిసె గింజ‌ల‌తో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

అయితే ఓ లడ్డూ మీకు ఇమ్యూనిటితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. దీనికోసం మార్కెట్​కి వెళ్లాల్సిన అవసరం లేదు. కిచెన్​లో గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం సమయాన్ని వెచ్చించి.. మీరు టేస్టీ ఇమ్యూనిటీ లడ్డూల ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు:- అవిసె గింజలు – 4 టేబుల్ స్పూన్లు, బెల్లం – 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు – 100 గ్రాములు, బాదం – 100 గ్రాములు, ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్, యాలకూల పొడి – అర టీస్పూన్, నెయ్యి – లడ్డూలు చుట్టేందుకు సరిపడా.

తయారీ విధానం:- ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి రోస్ట్ చేయండి. చివర్లో అవిసె గింజలు వేసి.. వేగాక తీసేయండి. వాటిని పూర్తిగా చల్లార్చనిచ్చి.. మిక్సిలో వేయాలి. వాటిని పూర్తిగా పొడిగా కాకుండా.. కాస్త ముక్కలుగా ఉండేలా మిక్సి చేసుకోవాలి. దానిలో బెల్లం, యాలకుల పొడి వేసి మరో మిక్సీ చేయండి. ఈ మిశ్రమాన్ని నెయ్యి సహాయంతో లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే హెల్తీ, టేస్టీ లడ్డూలు రెడీ. ఈ లడ్డూలు చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలా ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు.

దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. హృదయ సంబంధ వ్యాధులను దరిచేరనీయవు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. పైగా దీనిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించి.. శరీరంలోని మలినాలను, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మలబద్ధకం పూర్తిగా తగ్గుతుంది. పోషకాలకు పవర్​హౌస్​ అయిన ఈ లడ్డు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

దీనిలోని ఒమేగా 3, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఆరోగ్యకరమైన చర్మాన్ని, జుట్టును అందిస్తాయి. ముఖ్యంగా మధుమేహాన్ని దూరం చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. శరీరానికి అన్ని పోషణలు అందిస్తూనే బరువును ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గేందుకు ఈ లడ్డూలు బెస్ట్ ఆప్షన్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూను మీ డైట్​లో కచ్చితంగా చేర్చుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker