ఈ జ్యూస్ తాగితే మీ రక్త నాళాలు, లివర్ లోని మలినాలన్ని తొలగి శుభ్రంగా ఉంటాయి.
బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. అయితే మానవ శరీరంలో ప్రతీ అవయం ముఖ్యమైనది. దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. ఏ చిన్న అవయం పని చేయకపోయినా.. మొత్తానికి శరీరంపైనే ఎఫెక్ట్ చూపిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో రక్త నాళాలు, కాలేయం కూడా చక్కగా పని చేస్తాయి. మరి ఈ రెండూ ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి సంబంధించిన ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి.
కేవలం నాలుకకు రుచిగా ఉండే ఆహారాలే కాకుండా.. శరీరంలోని ప్రతి అవయవానికి అవసరమైన ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉంటే.. ఆరోగ్యకరంగా ఉంటాం. రక్త నాళాలు, కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో బీట్ రూట్, అల్లం ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని రెండూ జ్యూస్ చేసుకుని తాగితే.. కాలేయం, రక్త నాళాలు శుభ్రంగా ఉంటాయి. ఈ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు.. బీట్ రూట్, అల్లం, క్యారెట్, కొత్తిమీర, ఒక టమాట,
తయారీ విధానం:- బీట్ రూట్ కి తొక్కలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం, క్యారెట్, టమాటాని కూడా తరిగి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ లో బీట్ రూట్, క్యారెట్ ముక్కలు వేసి ముందు మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొత్తిమీర, అల్లం, టమాట ముక్కలు వేసి ఈ మిశ్రమం అంతా మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి దీని నుండి జ్యూస్ ను తీసుకోవాలి. ఈ జ్యూస్ ఇలా డైరెక్ట్ గా ఫ్రెష్ గా ఉన్నప్పుడే తాగాలి. ఇలా తాగలేని వారు కొద్దిగా నిమ్మరం, తేనె కలుపుకుని తాగవచ్చు.
ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రక్త నాళాలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జ్యూస్ ప్రయోజనాలు:- చర్మం కాంతివంతంగా.. ఈ జ్యూస్ ను తాగడం వల్ల చర్మం అందంగా, కాంతి వంతంగా తయారవుతుంది. గుండె ఆరోగ్యం.. బీట్ రూట్-అల్లం జ్యూస్ తో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ దరి చేరదు.. ఈ జ్యూస్ లను తాగడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడుతుంది.
మలినాలు.. ఈ జ్యూస్ ను తరుచూ తాగడం వల్ల రక్త నాళాల్లో, కాలేయంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో.. ఈ జ్యూస్ తో శరీరంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.