ఈ జ్యూస్ లు తరచూ తాగుతుంటే మీ కాలేయం ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉంటుంది.
కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. అయితే మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడానికి, గ్లూకోజ్‌ను తయారు చేయడానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి పనిచేస్తుంది. ఇది పోషకాలను సేకరిస్తుంది. శరీరం నుంచి పిత్తాన్ని బయటకు పంపుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించే ప్రక్రియను ఇంగ్లీషులో డిటాక్స్ అంటారు.
కొన్ని జ్యూస్ లను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండొచ్చు. గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు పోతాయి. పచ్చి కూరగాయలను సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. ఆకుకూరల రసాన్ని తాగితే వాటిని జీర్ణం చేసేందుకు శరీరం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. బదులుగా పోషకాలను వెంటనే పొందడం సులభం అవుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో క్యారెట్ జ్యూస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయి. క్యారెట్ రసం కాలేయంలో పేరుకుపోయిన పైత్యాన్ని, కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. క్యారెట్ రసంలో పెద్ద మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది.
ఇది కాలేయం, పెద్ద పేగును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి. బీట్‌రూట్ రసం మొత్తం శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి ఇది దివ్య ఔషధం. బీట్‌రూట్ కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మూత్ర నాళం నుంచి బయటకు వెళ్లి కాలేయ పనుతీరును మెరుగుపరుస్తుంది. మీకు టీ అంటే ఇష్టమైతే గ్రీన్ టీని ఎంచుకోవాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. గ్రీన్ టీ శరీరం నుంచి కొవ్వును కరిగించడంలో కూడా చాలా సహాయకారిగా ఉంటుంది.
దీనివల్ల కాలేయం భారం కొంతమేర తగ్గుతుంది. మీరు రోజంతా ఒక కప్పు గ్రీన్ టీ తాగితే కాలేయానికి మద్దతు ఇస్తుంది. గ్రీన్ టీలో చెక్కర వేసుకోకుండా ప్రయత్నించండి. ది వరల్డ్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధ్యయనంలో గ్రేప్ ఫ్రూట్ కాలేయానికి మంచి ఆహారంగా పరిగణించబడింది. ద్రాక్ష పండులోని రెండు ప్రధాన యాంటీఆక్సిడెంట్లు నరింగిన్, నరింగెనిన్. ఇది కాలేయ వాపును తగ్గించడం, కాలేయ కణాలను రక్షించడం ద్వారా కాలేయాన్ని గాయం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది.
కొవ్వును కరిగించే ఎంజైమ్‌లను పెంచుతుంది. అల్లం, లెమన్ టీ లివర్ డిటాక్స్‌కి అద్భుతమైన రెమెడీ. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది బరువు తగ్గే ప్రక్రియను కూడా పెంచుతుంది. ఇది అపానవాయువు సమస్యను దూరం చేస్తుంది. జీవక్రియను పెంచడంతో పాటు వ్యాధులను నివారిస్తుంది. ఓట్స్‌లో ఫైబర్, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలేయం, పేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 2017 సంవత్సరంలో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఓట్స్ కాలేయం నుంచి కొవ్వును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.