Health

టమాటాలా కనిపిస్తున్నా ఈ పండ్లు గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు దివ్యా ఔషధం.

చెర్రీ పండ్లలో విటమిన్ సి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, చెర్రీలో అనేక రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రములో ఉద్యానవన పరిశోధన కేంద్రములో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా నాటిన కరేబియాన్ చెర్రిస్ చెట్లు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి. చెర్రి అనేది ప్రునస్ జాతికి చెందిన మొక్కలు. వెస్ట్ ఇండియన్స్ చెర్రీ, బార్బర్ చెర్రీ ఉష్ణ మండల పంటగా పరిగణిస్తారని అంటున్నారు వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్త శివకుమార్.

ఈ పంట మెక్సికో, సెంట్రల్ అమెరికా ఆరిజన్ లో ఎక్కువగా ఉంటుంది. బ్రెజిల్ లో ఈ పంట ఎక్కువగా పండిస్తుంటారు. మన భారతదేశంలో ఈ పంట అంతగా అందుబాటులో లేదు. మార్కెట్లో ఈ పళ్ళు అందుబాటులో లేకపోవడంతో వీటిపై అవగాహన తక్కువ. ఇప్పుడు చింతపల్లిలో శాస్త్రవేత్తల ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తుండడంతో ఈ చెర్రీస్ పై ఆసక్తి ఏర్పడింది. మార్కెట్లో లభించే మెజార్టీ ఫలాల్లో కంటే ఈ కరేబియన్ చెర్రీస్ పండ్లలో విటమిన్ “సి” పుష్కలంగా ఉంటుంది. మనుషిలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. మామిడి, సపోటా, పియర్, యాపిల్ కంటే వెస్ట్ ఇండియన్ చెర్రీ, బార్బదోస్ చెర్రీ లో విటమిన్ సి మెండుగా ఉంటుందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. వాతావరణం కూడా కీలకమే..ఈ వెస్టిండీస్ చెర్రీస్ మొక్కకు 26 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం.

ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే పూత ఎక్కువగా వచ్చి కాయలు పండ్లు ఎక్కువగా పండుతాయి. సాధారణంగా మనకి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పూత ఉంటుంది. మే నుంచి డిసెంబరు జనవరి వరకు ఈ పళ్ళు అందుబాటులో ఉంటాయి. పూత, కాయ కాసే సమయంలో నీరు అధికంగా కావాలి. వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ కరేబియాన్ చెర్రీస్ ఎక్కువగా కాస్తాయని అంటున్నారు. నీరు పుష్కళంగా అందించగలిగితే..వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో నీటి సదుపాయం ఇవ్వగలిగితే పూత కాయ అధికంగా వస్తుంది. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఈ పండ్లు మార్కెట్లో అందుబాటులో లేవు కానీ.. చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో 20 ఏళ్ల క్రితం ఈ చెట్లను ప్రయోగాత్మకంగా నాటారు. చెట్టు ఎదుగుదల పూత, కాయ పుష్కలంగా వస్తున్నాయి.

అయితే.. ఈ పళ్ళపై అవగాహన లేక సరైన మార్కెట్ లేకపోవడం వలన సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు దివ్యా ఔషధం..కరేబియాన్ చెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు తొలగిస్తుంది. గుండెజబ్బులు, కీళ్ళనొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. రెగ్యులర్‌గా తినడం మంచిదని అంటున్నారు శాస్త్రవేత్తలు, వైద్యులు. ఇప్పటికే ఆపిల్ స్ట్రాబెరీ డ్రాగన్ ఫ్రూట్ పంటలకు అనుకూలమైన చింతపల్లి ఏజెన్సీలో కరేబియన్ చెరీస్ పంటను విస్తరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు రైతులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker