Health

రోడ్ల పక్కన ముళ్ళ పొదల్లో కనిపించే ఈ కాయలు దీర్ధకాలిక రోగాలకు దివ్య ఔషధం.

భారత దేశంలో అతి పురాతన వైద్యం ఆయుర్వేదం.. ఈ వైద్య విధానంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్లు.. ఆకులు కాయలు వంటివే ఔషదాలుగా ఉపయోగిస్తారు.. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఓ చెట్టు విరిగి చెట్టు.. వీటి కాయలను విరిగి కాయలు చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయలు చెట్టు నెక్కర కాయలు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ విరిగి చెట్లు పల్లెటూర్లలో పట్టణాలలో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి.

ఈ చెట్టుకు గుత్తులు గుత్తులుగా చాలా కాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో ఈ పండును భాగం చేసుకుంటే సంపూర్ణ పోషకాహారం తిన్నట్టే లెక్క. ఈ పండు తినడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా సాగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని ఔషధ గుణాలను ఆయుర్వేద వైద్యంలో కూడా గుర్తించారు. వివిధ వ్యాధుల చికిత్సకు ఆయుర్వేద మందుల్లో ఈ పండును ఉపయోగిస్తారు. ఇలా సోడా పండును పచ్చిగానూ తినొచ్చు, వండుకొని కూడా తినొచ్చు.

పచ్చిగా తింటే చిరుతిండిలా ఉంటుంది. చిటికెడు ఉప్పు, కారం చల్లుకొని ఈ పండును అద్దుకొని తింటే అదిరిపోతుంది. అలాగే ఇతర పదార్థాలతో కలిపి ఊరగాయగా కూడా ఈ పండును చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ ఊరగాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రాజస్థాన్లోని చిన్నచిన్న గ్రామాల్లో లాసోడా పండ్ల చెట్లను పండిస్తారు. కిలో పండ్లు 180 రూపాయలు నుంచి 200 రూపాయలు దాకా అమ్ముడవుతాయి. అక్కడి ప్రజలు వీటిని అధికంగా తింటారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోనే ఈ చెట్లు అధికంగా కనిపిస్తాయి.

ఈ లాసోడా చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమే. ఈ చెట్టు కాండాన్ని కలపగా ఉపయోగిస్తారు. ఆకులను ఒంటెలు, మేకలకు ఆహారంగా వినియోగిస్తారు. ఎక్కువగా పశువులు ఈ చెట్టు ఆకులను తిని బతుకుతాయి. వేసవిలోనే ఈ పండు లభిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల పొట్టకు చల్లదనం అందుతుంది. కాలేయం సమస్యలను దూరం చేస్తుంది. రక్తపోటు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు. ఈ పండును తినడం చాలా ముఖ్యం. చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ పండును తింటే ఆ సమస్యలు దూరం అవుతాయి. ఈ చెట్టు ఆకులను ఎండబెట్టి పొడిగా మార్చి దాచుకోవాలి.

వాటిని గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం వల్ల కీళ్లనొప్పలు, వాపు వంటివి తగ్గుతాయి. పంటినొప్పిని తగ్గించడంలో కూడా ఇది ముందుటుంది. లసోడా పండ్లను అధికంగా మాత్రం తినకూడదు. చాలా మితంగా తినాలి. రోజుకు రెండు నుంచి మూడు పండ్లు తింటే చాలు. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. డయాబెటిస్ వ్యాధితో పోరాడుతున్నవారు దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker