ఈ కాయలు తరచూ తింటే మీ జీవితకాలంలో గుండె జబ్బులు రానేరావు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కారొండా రసం తాగాలి. గుండె కండరాలను బలోపేతం చేయడానికి, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచడానికి వారానికి రెండు లేదా మూడు సార్లు ఒక గ్లాసు కరోండా పండ్ల రసాన్ని తప్పక తీసుకోవాలి. అయితే ఈ పండు పేరు కరంచా పండు. దీన్ని కొరొంచా, కరొండా, కరొంచా, కరిస్సా వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఈ పండును అమ్ముతున్నారు.
డ్రై ఫ్రూట్స్ లాగా కూడా లభిస్తోంది. నిజానికి ఇది బెంగాల్లో కనిపించే పండు. అక్కడి మార్కెట్లు, గ్రామాల్లో దీన్ని చూడగలం. ఇది చిన్నగా, పుల్లగా ఉండే పండు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు వేసవి, వర్షాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. దీని శాస్త్రీయ నామం Carassisa carandas, ఇంగ్లీష్ నామం Ecocanaceae. ఈ పండు రంగు లేత ఎరుపు, గులాబీ, తెలుపు ఉంటుంది. కరంచా పండు మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. రకరకాల వ్యాధుల్ని నయం చేస్తుంది.
ఉదాహరణకు కరంచా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ధమనులలో రక్త ప్రసరణ సాధారణంగా ఉంటుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. అధిక బరువు ఉండేవారు ఈ పండును తినడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. ఈ పండు.. శరీరంలో కొవ్వును ఐస్‌క్రీమ్‌లా కరిగించేస్తుంది. అలాగే.. ఇది పొట్ట సంబంధ వ్యాధుల నుంకి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
పచ్చి కరంచా తినడం వల్ల దంతాలు, చిగుళ్లు బలపడతాయి. కరంచాలో విటమిన్ B, Cతోపాటూ.. ఐరన్ పుష్కలంగా ఉంచుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు, క్యారిసోన్స్, ట్రైటెర్పెనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండుకి డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువే. 100 గ్రాముల ప్యాకెట్ రూ.70 రూపాయలకు పైనే ఉంటుంది. ఈ పండు పుల్లని రుచిని కలిగి ఉంటుంది.
ఐతే.. కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా కరంచాను తీసుకోవాలి. తద్వారా అనారోగ్యాలు నయమవుతాయి. కరంచాలో ఉండే రాగి…. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చూడటానికి చెర్రీ పండులా కనిపించినప్పటికీ, రుచి వేరుగా ఉంటుంది. ఈ పండును రకరకాల కూరల్లో వాడుతారు. అలాగే పచ్చళ్లు చేసి కూడా తింటారు.