Ayurveda

ఈ చెట్టు పువ్వులు, ఆకులు, వేర్లలోని ఔషధ గుణాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ మొక్కను వైల్డ్ జాస్మిన్, వింటర్ జాస్మిన్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. సాయంత్రం అవగానే చెట్టుకి విచ్చుకున్న పువ్వులను కోయడానికి అమ్మాయిలు పోటీ పడతారు. అయితే ఈ సన్నజాజి మొక్క ప్రతి తెలుగు వారి ఇంట్లో కొలువుదీరుతుంది. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందట. అంతేకాదు సన్నజాజుల పరిమళాన్ని పీల్చడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చెట్టు ను వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. శివుడి అనుగ్రహాన్ని ఇస్తాయి.

సఖల దేవత ఆరాధన సన్నజాజులతో చేయవచ్చు. అయితే మనసుదోచే సువాసనలు వెదజల్లే సన్నజాజి పూల మొక్కను చాలామంది ఇంటి పెరట్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ మొక్క లో ఉన్న ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సన్నజాజి మొక్కలోని ఆకులు, వేర్లు, కాండం మరియు పువ్వుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

సన్నజాజి పూల మొక్కలను ప్రాంతాలను బట్టి వైల్డ్ జాస్మిన్,వింటర్ జాస్మిన్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం సన్నజాజి పూలతో తయారయ్యే సబ్బులు, ఫేస్ క్రీములు, సువాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్స్ వంటి వాటికి ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ కలదు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సన్నజాజి పూలతో ప్రతిరోజు టీ ని తయారు చేసుకొని సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.సన్నజాజి పూల టీ ప్రతి రోజూ సేవించడం వల్ల యాంటిడిప్రెసెంట్ మరియు కామోద్దీపన లక్షణాలను కలిగించడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

చిగుళ్ల సమస్యలు, దంతక్షయం, నోట్లో పుండ్లు, నోటిపూత వంటి సమస్యలతో బాధపడేవారు సన్న జాజి ఆకులను బాగా మరిగించి ఆ కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే నోటిలోని ప్రమాదకర బ్యాక్టీరియా నశించి సమస్యలను అదుపులో ఉంచుతుంది. సన్నజాజి పూల కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే పూలలో ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది దాంతో శరీర బరువును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులను అదుపు చేయడంలో సన్నజాజి ఆకులు బాగా ఉపయోగపడతాయి దీనికోసం సన్నజాజి ఆకులను మెత్తటి మిశ్రమంగా చేసుకొని చర్మంపై మర్దన చేసుకుంటే చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే సన్నజాజి ఆకులను మెత్తగా రుబ్బి తలకు పట్టించుకుంటే తలలో చుండ్రు సమస్య తగ్గి జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.సన్నజాజి పూల పరిమళాలు మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. దాంతో అలసట,చిరాకు, ఆందోళన, తలనొప్పి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker