ఈ డ్రింక్ ఇంట్లోనే చేసుకొని తాగితే మీ గుండె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
అలసట, ఒత్తిడి కారణంగా గుండె వైఫల్యం. గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే బీపీ, కొలస్ట్రాల్ లాంటివి ఏవీ లేకుండా ఉంటే జీవితం ఎంతో నిశ్చింతగా ఉంటుంది. మరి అలా ఉండాలంటే అందుకు తగినట్లుగా మన అలవాట్లూ ఉండాలి. వ్యాయామాల విషయంలో, ఆహారాల విషయంలో దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. అయితే కొన్ని పానీయాలున్నాయి. అవి మన గుప్పెడంత గుండెకు చెప్పలేనంత రక్షణ కోటను కట్టేస్తాయి.
అందుకే వాటిని రోజూ తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తాగడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. క్యారెట్ స్మూతీ.. కొంచెం క్యారెట్, కొద్దిగా కమలా ఫలం ముక్కల్ని తీసుకుని రెండింటినీ కలిపి స్మూతీలా చేసుకోండి. దీనిలో చాలా ఎక్కువగా విటమిన్ సీ, బీటా కెరోటిన్లు ఉంటాయి. ఇంకా పొటాషియం, విటమిన్ ఏ, బయోటిన్, విటమిన్ బీ6, విటమిన్ కే1 వంటి పోషకాలూ లభిస్తాయి. ఇవన్నీ రక్త పోటును తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ప్రొటీన్ శోషణను పెంచుతాయి. దీంతో ఎముకలూ బలోపేతం అవుతాయి.
దానిమ్మ రసం..ఈ కాలంలో దానిమ్మ కాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలా దొరుకుతున్న సమయం అంతా ఉదయాన్నే దానిమ్మ రసం తాగేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలోకి వస్తుంది. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. తద్వారా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలస్ట్రాల్ పని తీరును మెరుగు పరిచి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి.
అందువల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బీట్ రూట్ రసం..బీట్ రూట్‌లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, సీలు ఉంటాయి. కొంత మందికి రక్త పోటు తక్కువగా ఉంటుంది. అలాంటి వారు బీట్ రూట్ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ఇది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. దీంతో వాటి పని తీరు మెరుగవుతుంది. దీనిలో ఉన్న నైట్రేట్ సమ్మేళనాలు రక్తంలోకి వెళ్లాక నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. ఇవి రక్త నాళాలా వ్యాసార్థాన్ని పెంచుతాయి.
దీంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రీన్ టీ..ఉదయం, మధ్యాహ్నం చాలా మందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. వీటికి బదులుగా గ్రీన్ టీ తాగడాన్ని అలవాటుగా చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.