News

ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే పెటాకులేనా..! వాళ్ళు విడాకులు తీసుకోవడం ఖాయం అంటా..?

పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే అయితే జ్యోతిష్యంలో భాగమైన న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. సాధారణంగా మనం అబ్బాయి లేదా అమ్మాయి జాతకాన్ని చూసి తేదీని ఫిక్స్ చేసినా, సంఖ్యల ప్రకారం ఆ తేదీ చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అవును నిర్దిష్ట తేదీలలో వివాహం చేసుకున్న వారు.. ఇబ్బందులు పడతారని చెపుతున్నారు.

4, 13, 22, 31 తేదీల్లో వివాహం చేసుకున్న వారికి జీవితంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ తేదీలలో వివాహం చేసుకున్న వారు చాలా త్వరగా లేదా 4 సంవత్సరాలలోపు విడిపోయే అవకాశం ఉందంట. రిలేషన్ షిప్ లో ప్రేమ, సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కొన్ని సమస్యల వల్ల మన బంధం దెబ్బతినే అవకాశం ఉందంట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ తేదీలలో వివాహం చేసుకున్న వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెపుతున్నారు. దీని కారణంగా జీవిత భాగస్వామితో చాలా గొడవలు జరుగుతున్నాయి. అంతే కాకుండా వారి మధ్య మాటల వల్ల మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందంట.

కాబట్టి మీరు వివాహం చేసుకోబోతున్నట్లయితే.. ఈ తేదీలను కాకుండా వేరే తేదీని ఎంచుకోవడం ఉత్తమం. 7వ తేదీ అంత మంచిది కాదని కొందరు పండితులు అంటుంటారు. ఈ తేదీ మంచి ఫలితాలను ఇవ్వదంట.. కాబట్టి 7, 16, 25 తేదీల్లో పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటున్నారు. ఈ తేదీలో వివాహం చేసుకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవలిసి ఉంటుందంట. ఒక సమస్య తీరింది అనేలోగా మరో సమస్య మొదలయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. చివరకు విడాకులకు కూడా దారి తీస్తుందంట. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, 8, 17, 26, ఈ తేదీలలో పెళ్లి చేసుకోకూడదని కూడా అంటారు. ఈ తేదీలు అందరికీ కాదు.

ఈ తేదీలో వివాహం చేసుకున్న వారు అతి త్వరలో విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే అపార్థం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి, అందరినీ అడిగి తేదీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. న్యూమరాలజీ ప్రకారం 5, 14, 23 ప్రకారం ఈ తేదీల్లో కూడా పెళ్లి చేసుకోకూడదు. ఇది కేవలం అశుభ ఫలితాలను ఇస్తుందని అంటారు. ఈ తేదీలో వివాహ చేసుకుంటే జీవితంలో చిన్నపాటి వడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉందంట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker