Health

శరీరంలోని ఈ ప్రాంతాల్లో నొప్పి ఉంటె నిర్లక్ష్యం వద్దు, వెంటనే డాక్టర్ ను కలవండి. ఎందుకంటే..?

శారీరక శ్రమ లేకపోవడం, ఆయిల్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అయితే బాడీ పెయిన్స్ రాగానే కంగారు పడకుండా.. అసలు శరీరంలో ఏ ప్రాంతంలో ఒళ్లు నొప్పులు వస్తున్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి కానీ.. ఒళ్లు నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

చాలామందికి కంటిన్యూగా తలనొప్పి వస్తుంటుంది. ఎప్పుడో ఒకసారి తలనొప్పి వస్తే పర్వాలేదు కానీ.. ఎప్పుడూ తలనొప్పి వస్తే మాత్రం సమ్ థింగ్ ఉన్నట్టే. తలనొప్పితో పాటు చేతులు, కాళ్లలో స్పర్శ లేకపోవడం, ఊరికే ఎనర్జీ లాస్ అవుతూ ఉండటం, ఫేంట్ అవడం లాంటి లక్షణాలు అన్నీ కలిపి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది బ్రెయిన్ ట్యూమర్ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలతో పాటు నిరంతరం దగ్గు ఉంటే, చాతిలో నొప్పి ఉండటం లాంటివి ఉంటే అవి ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు.మహిళలకు అయితే రొమ్ములో నొప్పి ఉండటం, రొమ్ము పెరగడం, తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు. ఒకవేళ మీరు అన్నం తినే సమయంలో కడుపు నొప్పి నిరంతరం లేస్తూ ఉంటే, ఒక్కసారిగా బరువు తగ్గిపోయినా, కడుపు ఉబ్బినట్టు కనిపించినా అది స్టమక్ క్యాన్సర్ కావచ్చు. అలాగే.. పేగు క్యాన్సర్ లక్షణాలు కూడా ఇలా ఉంటాయి.

లెట్రిన్ వెళ్లినప్పుడు మల విసర్జన చేస్తుంటే తీవ్రంగా నొప్పి రావడం, మలంలోనూ రక్తం రావడం, ఒక్కసారిగా బరువు తగ్గడం లాంటివి ఉంటే అది పెద్ద పేగు క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. చాలామందికి మూత్రం పోసే సమయంలో నొప్పి వస్తుంటుంది. మామూలుగా అయితే ఏం కాదు కానీ.. కంటిన్యూగా నొప్పి వస్తే మాత్రం అది ప్రొస్టేట్ క్యాన్సర్ కావచ్చు. అందుకే పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి దానికి సరైన చికిత్స సకాలంలో తీసుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker