రోజూ ఈ ఆసనాన్ని ఐదు నిమిషాలు వేస్తె మీ నడుము సన్నని నాజుకుగా మారుతుంది.
భుజంగాసనం చేయడం వల్ల కోర్ కండరాలు బలంగా అవుతాయి. జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది. దీని వల్ల పొట్ట టోన్డ్ అవుతుంది. ముందుగా ఆసనం చేసేందుకు బోర్లా పడుకోవాలి. అరచేతులని భుజాల క్రింద నేలపై పెట్టాలి. చేతులని కిందికి నెడుతూ తలని మెల్లిగా పైకి లేపాలి. నడుము భాగాన్ని పైకి వంచాలి. దీని వల్ల నడుము భాగం బలంగా మారతారు. అయితే యోగాతో అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. యోగాతో సమస్యలకు చెక్ పెట్టుకోవడమే కాదు.. అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
యోగాలో కొన్ని రకాల ఆసనాలను రోజూ వేస్తే అనేక ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతూంటారు. ఇలాంటి వారికి ఏ పని చేయాలన్నా.. వంగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు ఈ యోగాసనం వేస్తే కేవలం నెల రోజుల్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. యోగాలో భుజంగాసనం కూడా ఒకటి. ఇది వేయడం చాలా సింపుల్. భుజంగ అంటే సంస్కృతంలో పాము అని అర్థం. నాగు పాము ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఈ ఆసనాన్ని వేయాలి.
భుజంగాసనం ఎలా వేయాలంటే:- భుజంగాసనాన్ని వేయడం కోసం ముందుగా మ్యాట్ పై బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత చేతులతో నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపాలి. నెక్ట్స్ తలను పైకెత్తి చూడాలి. పగడ విప్పిన నాగు పాము ఎలా ఉంటుందో.. ఈ ఆకారంలో మీరు వేసిన ఆకారం ఉండాలి. ఈ భంగిమలో 5 నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఇలా రోజూ మీకు కుదిరిన సమయంలో ఆసనం వేస్తూ ఉంటే చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. భుజంగాసనం ప్రయోజనాలు..
మెడ, భుజాలు దృఢంగా ఉంటాయి:-ఈ ఆసనాన్ని రోజూ క్రమం తప్పకుండా వేయడం వల్ల మెడ, భుజాలు దృఢంగా ఉంటాయి. నొప్పులు ఏమైనా ఉన్నా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కంప్యూటర్ల ముందు పని చేసే వారికి భుజాలు, మెడ భాగాలు నొప్పిగా ఉంటాయి. ఇలాంటి వారికి ఆ ఆసనం బాగా హెల్ప్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా దృఢంగా ఉంటాయి:- బెల్లీ ఫ్యాట్ తో ఉన్న వారికి ఈ ఆసనం బాగా హెల్ప్ అవుతుంది. పొట్ట కండరాలు దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
పొత్తి కడుపు కండరాలపై ఒత్తిడి తీసుకొచ్చి.. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. ఆస్తమా వారికి ఈ ఆసనం హెల్ప్ అవుతుంది:- ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్న వారు ఈ ఆసనం తరచూ వేసుకోవడం వల్ల రిలీఫ్ గా ఉంటుంది. శ్వాస కోశ సమస్యలు కూడా ఉండవు. వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది:- భుజంగాసనాన్ని తరచూ వేయడం వల్ల కూడా వెన్నుముక బలంగా ఉంటుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.