News

ఈ రక్త పరీక్షలు తరచూ చేపిస్తూ జాగర్తగా ఉంటె చాలు, మీరు నూరేళ్లు బతుకుతారు.

ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి తగిన ప్రయత్నాలు మాత్రం చేయం. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు జీవన ప్రమాణం మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. తిండికి సంబంధించిన పొరపాట్ల వల్లే ఏటా కోటికి పైగా మరణాలు, 25 కోట్లకు పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఓ నివేదిక సారాంశం. అయితే మన శరీరంలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. కొన్ని సార్లు ప్రాణాంతక వ్యాధులు లోలోపల వృద్ధి చెందుతాయి. అన్నిసార్లు ఇలా జరగకపోయినా.. వ్యాధిని సకాలంలో గుర్తించడం చాలా అవసరం.

అందుకు మీ శరీరంలో ఎలాంటి వ్యాధిలేకపోయినా ప్రతి యేట కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. USG నుంచి యూరినాలిసిస్ వరకు అవయవాల ఎక్స్-రేల వరకు, వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడే వివిధ రకాల పరీక్షలు సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో రక్త పరీక్షలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా షుగర్‌, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ వంటి వాటి స్థాయిలను నిర్దారించడానికి రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల సకాలంలో వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు.

ప్రతి సంవత్సరం చేయించుకోవల్సిన రక్త పరీక్షలు ఇవే..‘CBC’ టెస్ట్‌.. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ల పరిమాణాన్ని కొలవడానికి CBC పరీక్ష అవసరం. ఈ పరీక్ష ద్వారా రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ని సులభంగా గుర్తించవచ్చు. రక్తం గడ్డకట్టే సామర్థ్యం కూడా ఈ రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది. లిపిడ్ ప్రొఫైల్.. ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత పెరిగిందో తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవల్సి ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం ఈ రక్త పరీక్ష చేయించుకుంటే కొలెస్ట్రాల్ సమస్య నుంచి మిమ్మల్ని మీరు సకాలంలో రక్షించుకోవచ్చు.

గ్లూకోజ్.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని గుర్తించకపోతే మధుమేహం శరీరంపై నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. ప్రతి సంవత్సరం గ్లూకోజ్‌ని చెక్ చేయడం ద్వారా చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి నిర్ణీత వ్యవధిలో ఉపవాసం గ్లూకోజ్, HbA1c రక్త పరీక్షలను చేయించుకోవాలి. థైరాయిడ్..థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ రేటును నిర్వహించడం నుంచి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వరకు అన్నింటికీ అవసరం. ఈ హార్మోన్ పరిమాణం పెరిగినా లేదా తగ్గినా శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి.

బరువు పెరగడం నుంచి మానసిక కల్లోలం వరకు అనేక సమస్యలు ఈ హార్మోన్‌ వల్ల సంభవిస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి. CMP టెస్ట్..శరీరంలో సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బొనేట్, క్రియాటినిన్, నైట్రోజన్, బిలిరుబిన్, అల్బుమిన్, ప్రొటీన్ వంటి మూలకాలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి CMP రక్త పరీక్ష అవసరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker