ఈ గుడిలో అక్షరాభ్యాసం చేయించారో..? భవిష్యత్తులో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది.
చదువుల తల్లి సరస్వతి దేవి కనుక అక్షరాభ్యాసం వసంత పంచమి రోజున పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు.ఈ వసంత పంచమి రోజు ఉదయం లేదా సాయంత్రం ఆలయాలకు చేరుకుని పండితులతో పూజలు చేయించి పిల్లల చేత తొలి అక్షరాలను రాయిస్తారు. అయితే భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలో రెండో సరస్వతి దేవాలయంగా నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో వెలసి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి బాసరగా ఉండగా, రెండవది నల్గొండ జిల్లాలోని అడ్లూరు గ్రామంలో వెలసి ఉండడంపై ఇక్కడ భక్తులు ఆనందం వ్య క్తం చేస్తున్నారు.
ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే వీణ, గాన ,నృత్య , సరస్వతి దేవి మూడు రూపాల్లో ఇక్కడ దైవ దర్శనం కలుగుతుంది. 23 మార్చి 1983లో ఈ ఆలయం లో అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. పానుగంటి మదనాచారి దీనిని ప్రతిష్టింప చేసింది. ఇతనికి కలలో అమ్మవారు కనిపించి ఆలయాన్ని ప్రతిష్టాపించాలని కోరడంతో ఆలయం నిర్మించడం జరిగింది. పర్వదిన సమయంలలో ప్రతి శుక్రవారం భక్తులు తండోపతండాలుగా వస్తారు. లక్షల మంది ఇక్కడికి నల్లగొండ జిల్లా తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి , జిల్లాల నుండి వస్తున్నారు.
పర్వదిన సమయంలో మూలా నక్షత్రంలో వసంతి నక్షత్రం రోజున దసరా మధ్యలో మూలా నక్షత్రం వస్తది. ఈ సంవత్సరంలో ఈ రెండు రోజులు బాగా ఉంటాయి. ఆరోజు అక్షరాభ్యాసం, పెన్ను పూజలు పుస్తక పూజలు బాగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ రెండు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్లు ఉద్యోగ ప్రాప్తి , ఆరోగ్యంగా, ప్రశాంతత, అదేవిధంగా రాజకీయాల్లో గాని అన్ని రంగాల్లో విజయం సాధిస్తామని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.
ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన వాళ్ళకి విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సైతం వస్తున్నాయని భక్తులు చెప్తున్నారు. ఈ దేవస్థానం ఇప్పుడు ఈ నోట ఆ నోటపడి సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల జిల్లాల గుండా వ్యాపించింది. బాసరకు వెళ్లలేని వాళ్లు అడ్లూరు గ్రామంలోని సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్తున్నారు. అక్షరాభ్యాసం చేసిన వాళ్ళకి విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సైతం వస్తున్నాయని భక్తులు చెప్తున్నారు.