బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా..? పెను ప్రమాదంలో ఉన్నట్లే జాగ్రత్త.
పళ్లను బ్రష్ చేసుకునేటప్పుడు, చిగుళ్ళ నుంచి మొదలుపెట్టి పళ్ళ మీదకు వెళ్ళేలా బ్రష్‌ను కదుపుతూ పళ్లు తోముకోవాలి. అలాగే పై పళ్ళను ముందు చిగుళ్ళ మీద ఉంచి పళ్ళ మీదకు, కిందకు వచ్చేలా బ్రష్ చేసుకోవాలి. బ్రష్‌తో పళ్లు తోముకున్న తరువాత చూపుడు వేలుతో చిగుళ్ళను మృదువుగా మర్ధించినట్లు చేయాలి. ఇది చిగుళ్ళకు రక్త ప్రసరణను పెంచేందుకు, దంతాల ఆరోగ్యం మెరుగయ్యేందుకు ఎంతో తోడ్పడుతుంది. అయితే కొంతమందికి ఆపిల్ ను కొరికి తింటే కూడా చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. మరికొందరికి పళ్లు తోముకునేటప్పుడు రక్తం కారుతుంది.
చిన్న సమస్యే అని దీన్ని లైట్ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల నుంచి రక్తం కారడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. సూక్ష్మక్రిముల కారణంగా చిగుళ్ళు వాపునకు గురవుతాయి. అయితే చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. అయితే మీ శరీరంలో విటమిన్ సి, విటమిన్ కె లోపం ఉన్నా ఇలాగే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పొగాకును ఎక్కువగా వాడినా కూడా చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు కూడా చిగుళ్ల రక్తస్రావానికి కారణమవుతాయి. అలాగే చెడు ఆహారాలను తీసుకుంటే కూడా చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. బ్రష్ చేయాలి రోజుకు కనీసం రెండుసార్లైనా దంతాలను తోముకోవాలి. అయితే మనలో చాలా మంది రాత్రిపూట దంతాలను అసలే తోమరు. కానీ పడుకునే ముందు పళ్లు తోముకోవడం వల్ల రోజంతా పేరుకుపోయిన ఫలకం, బ్యాక్టీరియా తొలగిపోతాయి. నాలుకను శుభ్రం చేసుకోవాలి.. నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా నాలుక.
నాలుక క్లీన్ గా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దంతాలను బ్రష్ చేసిన ప్రతిసారీ అదనపు బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉండటానికి మీ నాలుకను క్లీనర్ తో తరచుగా శుభ్రం చేయండి. ఫ్లోసింగ్.. ఇది మనలో చాలా మంది చాలా అరుదుగా చేసే పని. కానీ నోటి పరిశుభ్రతకు ఇది చాలా అవసరం. ఫ్లోసింగ్ మన దంతాల మధ్య చిక్కుకున్న చిన్న ఆహార కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు జిగట కణాలను తొలగించడానికి రోజుకు కనీసం ఒకసారైనా ఫ్లోస్ చేయాలి.
చక్కెర ఉన్న ఆహారాలను మానేయాలి.. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు లేదా పానీయాలు మీ దంతాలను దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తిన్నాఅప్పుడే నోటిని బాగా కడుక్కోవాలి, వీలైతే బ్రష్ చేసుకోవడం మంచిది. మౌత్ వాష్..రోజూ మౌత్ వాష్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మౌత్ వాష్ ను ఉపయోగించడం వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.