Health

దంతాల నుంచి రక్తం వస్తుందా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

చాలా మంది ఇప్పుడు చిగుళ్లలో రక్తస్రావం లేదా అల్సర్‌తో బాధపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలో విటమిన్ సి వంటి పోషకాహార లోపాలు తరచుగా చిగుళ్ళ వాపుకు కారణమవుతాయి. ఇలా దంతాలకు సంబంధించిన అనేక సమస్యలు రావడం మొదలవుతాయి. అయితే చాలామంది దంతాల నుంచి రక్తం వచ్చే సమస్యతో బాధపడుతుంటారు. దంతాలను బ్రష్ చేసేటప్పుడు లేదా పుక్కిలించినప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతుంటే.. దానిని సాధారణమైనదిగా భావించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి చిగుళ్ళలో రక్తస్రావం అంతర్గత సమస్యను సూచిస్తుందని పేర్కొంటున్నారు. చిగుళ్ళ నుంచి రక్తస్రావం అనేది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. బ్రషింగ్, గాయాలు, గర్భధారణ, వాపు వంటి కారకాలు కూడా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ దంతాల నుంచి రక్తస్రావం అయితే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. తద్వారా మీ దంతాలు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగదని పేర్కొంటున్నారు. ఇంకా దంతాల మెరుపు, ఆరోగ్యం అలాగే ఉంటుంది. దంతాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి.. దంతాల నుంచి రక్తస్రావం జరగకుండా ఉండటానికి కనీసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.

ఒకసారి పుక్కిలించండి. గర్భధారణ సమయంలో దంత పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వాస్తవానికి గర్భధారణ సమయంలో హార్మోన్ హెచ్చుతగ్గులు చిగుళ్ల వ్యాధికి, చిగుళ్లలో రక్తస్రావానికి కూడా దారితీయవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రం చేయండి.. నోటి మురికిని శుభ్రం చేయడానికి బ్యాక్టీరియాను తొలగించడానికి మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పుక్కిలించవచ్చు. ఇలా చేయడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. కానీ మింగకుండా జాగ్రత్త వహించండి.

ధూమపానం మానేయండి..ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచడంతో పాటు ధూమపానం చిగుళ్ళలో రక్తస్రావం కూడా కలిగిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి ధూమపానం ప్రధాన కారణంమని పేర్కొంది. విటమిన్ సి తీసుకోవడం పెంచండి..విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. అలాగే దంతాలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా నిరోధించవచ్చు. దీని కోసం ఆహారంలో నారింజ, క్యారెట్, చెర్రీస్ తినడం మంచిదని పేర్కొంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker